Rohit Sharma Mumbai Indians :ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ త్వరలో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ చెప్పనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే అతడు కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడుతున్న ఓ వీడియోలో రోహిత్ మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్ ఇక అతడికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని అంటున్నారు. ఆ ఈ క్లిప్‌ను మొదట కోల్‌కతా జట్టు తమ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయగా, అది కాస్త కాంట్రవర్సీగా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ?
ఇదే చివరి సీజన్!
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ప్రాక్టీస్ సెషన్ జరగ్గా అక్కడ రోహిత్, కేకేఆర్ సహా కోచ్ అభిషేక్ నాయర్ కలుసుకున్నారు. ఇద్దరూ మంచి మిత్రులు కావడం వల్ల వాళ్లు కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో కెమెరామెన్ షూట్ చేసిన వీడియోను కేకేఆర్ ఫ్రాంచైజీ అప్లోడ్ చేసింది.
"ఒక్కొక్కటిగా అన్నీ మారిపోతున్నాయి. అదంతా వాళ్ల మీద ఆధారపడి ఉంది. నేను వాటన్నింటినీ పట్టించుకోను. ఏదేమైనప్పటికీ అది నా ఇల్లు భాయ్. ఆ దేవాలయాన్ని నేను నిర్మించాను" అని రోహిత్ అన్నాడు. ఆ తర్వాత ఫ్యాన్స్ నినాదాలు చేయడం వల్ల వాళ్లకు అభివాదం చేసిన రోహిత్ మరోసారి నాయర్‌తో మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ, ఆ మాటలు వీడియోలో క్లారిటీగా వినిపించలేదు. అయితే "భాయ్ నాదేముంది, ఇదే చివరిది" అని రోహిత్ అన్నాడంటూ నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.