Rohit Sharma KKR IPL:ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడనున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్లో 'ముంబయి కాకపోతే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు వెళ్లిపోతా' అని రోహిత్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ కన్ఫ్యుజన్కు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?
రోహిత్ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా హిట్‌మ్యాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అందులో ముంబయి కాకుండా ఐపీఎల్లో ఏ జట్టుకు నువ్వు కెప్టెన్ కావాలని అనుకుంటావ్? అని యాంకర్ అడిగింది. దీనికి రోహిత్ ' ఈడెన్ గార్డెన్ నా ఫేవరెట్ గ్రౌండ్. ఆ మైదానం నాకు చాలా కలిసొచ్చింది. అందుకే నేను కేకేఆర్ ఎంచుకుంటా' అని అన్నాడు. అయితే ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది పాత వీడియో. గతంలో రోహిత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక 2025లో రోహిత్ మెగా వేలంలో అందుబాటులో ఉండనున్నాడని ప్రచారం సాగుతోంది. కానీ, ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే!
ఈడెన్‌తో రోహిత్ స్పెషల్ బాండిగ్: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌తో రోహిత్ శర్మకు ప్రత్యేక అనుబంధం ఉంది. హిట్‌మ్యాన్ వన్డే చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది ఈ మైదానంలోనే. 2014లో శ్రీలంకతో మ్యాచ్‌లో రోహిత్ ఏకంగా 264 పరుగులు బాది వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈడెన్ వేదికగా టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసి, తొలి ఇన్నింగ్స్‌లోనే 177 పరుగుల స్కోర్ చేశాడు.