తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్సీ లేని రోహిత్ మరింత ప్రమాదకరం!- విరాట్​లా గర్జిస్తాడా?

Rohit Sharma IPL 2024: స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ 2024ఐపీఎల్​లో కెప్టెన్​గా కాకుండా కేవలం బ్యాటర్​గానే బరిలోకి దిగనున్నాడు. అయితే దాాదాపు 11 ఏళ్ల తర్వాత కేవలం బ్యాటర్ పాత్ర పోషించనున్న రోహిత్​​, పాత హిట్​మ్యాన్​ను గుర్తుతెచ్చేలా ఆడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Rohit Sharma IPL 2024
Rohit Sharma IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 2:05 PM IST

Rohit Sharma IPL 2024:2024 ఐపీఎల్​ సంబరం మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ దాదాపు 11ఏళ్ల తర్వాత కెప్టెన్​గా కాకుండా కేవలం ఒక బ్యాటర్​గా బరిలోకి దిగనున్నాడు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు రోహిత్ శర్మపైనే ఉండనుంది. మరి రోహిత్ ఈసారి ఎలా ఆడుతాడనేది ఆసక్తిగా మారింది.

ఇదివరకు రోహిత్ కెప్టెన్​గా జట్టును నడిపిస్తూ, బ్యాటింగ్​ భారాన్ని కూడా మోయాల్సి వచ్చింది. కానీ, గత రెండు సీజన్లుగా రోహిత్ బ్యాటింగ్​లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 2022లో 14 మ్యాచ్​ల్లో 268 పరుగులు, 2023లో 332 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 2022ఐపీఎల్​లో రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయకపోవడం గమనార్హం.

అటు జట్టు కూడా 2021, 2022లో ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలమైంది. గతేడాది ప్లేఆఫ్స్​కు వచ్చినా క్వాలిఫయర్- 2లో గుజరాత్ చేతిలో ఓడింది. ​దీంతో ముంబయి యాజమాన్యం జట్టు భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని రోహిత్​ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలు హార్దిక్ పాండ్యకు అప్పగించింది. ఇక రోహిత్​కు ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడం, పైగా సూపర్ ఫామ్​లో ఉండడం వల్ల ఈసారి ఐపీఎల్​లో హిట్​మ్యాన్ మెరుపులు చూడవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.

విరాట్ కూడా అలాగే!స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారధ్యం వహించాడు. అయితే పనిభారం కారణంగా 2021 తర్వాత కెప్టెన్సీ వదులుకున్నాడు. అప్పట్నుంచి ఆర్​సీబీని ఫాఫ్ డుప్లెసిస్​ నడిపిస్తున్నాడు. ఇక కెప్టెన్సీ వదులుకున్నాక విరాట్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాడు. గతేడాది 14 మ్యాచ్​లు ఆడిన విరాట్ మొత్తం 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు రోహిత్​కు కూడా కెప్టెన్సీ బాధ్యతలు లేవు కాబట్టి అతడిపై ఎలాంటి ఒత్తిడి ఉండకపోవచ్చు. దీంతో సీనియర్ ప్లేయర్​గా మైదానంలో హార్దిక్​కు సలహాలిస్తూ, మరోవైపు పరుగుల వరద పారించాలని ముంబయి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అతడు ఓ అద్భుతం - అసమాన్యుడు : పంత్​కు చికిత్స చేసిన డాక్టర్‌

రోహిత్ ముంబయిని వదిలేస్తే బెటర్- ఆ జట్టులోకి వెళ్తే కెప్టెన్ అవుతాడు!

ABOUT THE AUTHOR

...view details