Rohit Gill Centuries: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత మోగించారు. రోహిత్ 154 బంతుల్లో సెంచరీ అందుకోగా, కాసేపటికే గిల్ 137 బంతుల్లోనే బౌండరీతో శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది 12వ సెంచరీ కాగా, గిల్‌కు 4వ శతకం. ఇక వీరిద్దరికీ ప్రస్తుత సిరీస్‌లో ఇది రెండో సెంచరీ. ఇక 135 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 264-1 తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇక 52 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన రోహిత్ ప్రత్యర్థి బౌలర్లపై బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి ఓవరాల్‌గా హిట్‌మ్యాన్‌కు ఇది 48వ అంతర్జాతీయ శతకం. ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ పలు ఘనతలు అందుకున్నాడు.
- 2021 తర్వాత టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ మూడేళ్లలో రోహిత్ 6 శతకాలు బాదాడు. ఈ లిస్ట్‌లో గిల్ (3) రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
- ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత ఓపెనర్‌గా రోహిత్, సునీల్ గావస్కర్‌ను సమం చేశాడు. వీరిద్దరూ 4 సెంచరీలు బాదారు.
- అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన లిస్ట్‌లో రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్ట్‌లో డేవిడ్ వార్నర్ అందరికంటే ఎక్కువగా 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక వరుసగా సచిన్ (45 సెంచరీలు), రోహిత్ శర్మ (43 సెంచరీలు), క్రిస్ గేల్ (42), సనత్ జయసూర్య (41), మాథ్యూ హెడెన్ (40) ఉన్నారు.