ETV Bharat / bharat

దశావతారాలు, హనుమ, గరుడ- బాలరాముడి విగ్రహం ప్రత్యేకతలివే! - అయోధ్య రామయ్య ఫొటో

Ayodhya Ram Statue Photo : అయోధ్య రామమందిరంలో కొలువైన బాలరాముడి విగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. 51 అంగుళాలు పొడవున్న ఈ విగ్రహం దైవత్వం ఉట్టిపడేలా భక్తులను మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. విష్ణుమూర్తి దశావతారాలు సహా ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, స్వస్తిక్‌, హనుమ, గరుడను విగ్రహం చుట్టూ ఉండేలా అద్భుతంగా బాలరాముడి విగ్రహాన్ని మలిచారు.

Ayodhya Ram Statue Photo
Ayodhya Ram Statue Photo
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 11:01 PM IST

Updated : Jan 20, 2024, 7:03 PM IST

Ayodhya Ram Statue Photo : అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం చిత్రాలు బయటకు వచ్చాయి. గురువారమే రాముడి విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య రామ మందిరం గర్భగుడిలోకి చేర్చారు. గర్భగుడిలో కళ్లకు గంతలు కట్టి ఉన్న రాముడి విగ్రహం ఫొటోలు ఇదివరకే బయటకురాగా తాజాగా గర్భగుడిలో చేర్చకుముందు కళ్లకు గంతలు లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. బాల రాముడి చేతిలో బంగారు విల్లు, బాణాలు ఉన్నట్లు ఆ చిత్రాల్లో ఉంది.

మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు. 51 అంగుళాల పొడవైన బాలరాముడి విగ్రహం దైవత్వం ఉట్టిపడేలా భక్తులను మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను బాలరాముడి విగ్రహానికి ఇరువైపులా ఉండేలా అద్భుతంగా మలిచారు. బాలరాముడి విగ్రహం పైభాగంలో ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, స్వస్తిక్‌ గుర్తు ఉన్నాయి. కమల నయనాలను పోలినట్లు బాలరాముడి కళ్లను తీర్చిదిద్దారు. బాలరాముడి విగ్రహం కింద భాగంలో ఒకవైపు హనుమ, మరొకవైపు గరుడ ఉండేటట్లు విగ్రహాన్ని మలిచారు. మరోవైపు, అయోధ్యలో 300 అడుగుల దియా(మట్టి దీపం)ను వెలిగించారు. ఈ దీపం ప్రపంచంలో అతిపెద్దదని తెలుస్తోంది.

ఈనెల 22వ తేదీన రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ కార్యక్రమానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానించింది. 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడడం వల్ల అయోధ్యలో పనులు వేగంగా సాగుతున్నాయి.

PM Modi Fast For Prana Pratishtha : అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల పాటు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షలో భాగంగా ఉపవాసం చేస్తున్న మోదీ కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని, నేలపై దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా మోదీ 'గోపూజ' కూడా చేస్తున్నారని, గోవులకు ఆహారం ఇవ్వడం, అన్నదానం వంటి పలు రకాల కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Jan 20, 2024, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.