తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ 2024 : అనుష్క శర్మ వర్సెస్ రితికా- హాట్​ టాపిక్​ ఇదే​! - ముంబయి ఇండియన్స్ రోహిత్ కెప్టెన్సీ

Ritika Vs Anushka Rohith Sharma Captaincy : సోషల్​ మీడియాలో ఎప్పుడూ కోహ్లీ - రోహిత్​ ఫ్యాన్స్​ మధ్య వార్​ జరుగుతుంటుంది అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రితికా వర్సెస్ అనుష్క శర్మగా అభిమానుల మధ్య గొడవ జరుగుతోంది. ఏం జరిగిందంటే?

ఐపీఎల్ 2024 : రితికా వర్సెస్ అనుష్క శర్మ వార్ - ఫుల్ ట్రెండింగ్​!
ఐపీఎల్ 2024 : రితికా వర్సెస్ అనుష్క శర్మ వార్ - ఫుల్ ట్రెండింగ్​!

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 7:24 AM IST

Updated : Feb 7, 2024, 11:24 AM IST

Ritika Vs AnushkaRohith Sharma Captaincy : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ అభిమానుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటంది. తాజాగా సోషల్ మీడియాలో మరోసారి మాటల యుద్ధానికి తెరలేచింది. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ మార్పును తప్పుపడుతూ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే చేసిన కామెంట్‌పై నెట్టింట్లో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఈ చర్చలోకి విరాట్ భార్య అనుష్క శర్మ పేరును కూడా లాక్కొచ్చి రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో అనుష్క, రితికా పేర్లు ఎక్స్​లో ట్రెండింగ్​గా నిలిచాయి.

వివరాల్లోకి వెళితే. ముంబయి ఇండియన్స్(Mumbai Indians Captaincy) హెడ్ కోచ్ మార్క్ బౌచర్ - రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారో అసలు కారణాన్ని వివరించాడు. ఇది కేవలం ఆటను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీసుకుందని, ఉద్దేశపూర్వకంగా తీసుకున్నది కాదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో హిట్​ మ్యాన్​ భార్య రితికా రియాక్ట్ అయింది. 'ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయి' అంటూ కామెంట్ చేసింది.

ఈ కామెంట్​తో ముంబయి ఇండియన్స్ వర్సెస్ రోహిత్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న​ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లుగా అయింది. ముఖ్యంగా రోహిత్ అభిమానులు మరోసారి ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌పై భారీగా విమర్శలు చేస్తుండగా కోహ్లీ ఫ్యాన్స్​ జోక్యం చేసుకొని కౌంటర్లు వేస్తున్నారు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు అనుష్క శర్మ, రితికాలా? ఏడ్వలేదని అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌లకు రోహిత్ ఫ్యాన్స్ కూడా రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఇంకొంతమంది అనుష్క శర్మతో పోల్చుకునే రేంజ్​ రితికాకు లేదని, రోహిత్ వైఫ్​గానే ఆమెకు గుర్తింపు వచ్చిందని, కానీ అనుష్క స్టార్​ హీరోయిన్ అంటూ విరాట్​ ఫ్యాన్స్ చురకలంటిస్తున్నారు. రితికా కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పిందని రోహిత్ ఫ్యాన్స్​ అంటున్నారు. దీంతో రితికా, అనుష్క పేర్లు ఎక్స్​లో ఫుల్​ ట్రెండింగ్‌ అవుతున్నాయి.

అదరగొట్టిన కుర్రాళ్లు- అండర్‌-19 వరల్డ్​కప్‌ ఫైనల్‌కు టీమ్ఇండియా

టెస్టుల్లో కేన్ దూకుడు - రెండు ఇన్నింగ్స్​లో మూడు రికార్డులు

Last Updated : Feb 7, 2024, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details