తెలంగాణ

telangana

ETV Bharat / sports

రూ.70వేల కోట్ల నెట్​వర్త్​- ఈ క్రికెటర్​ కుబేరుడు గురూ- రోహిత్, విరాట్ కాదు - రిచెస్ట్ క్రికెటర్

Richest Cricketer World: క్రికెట్​కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒక్కసారి వరల్డ్​లో టాప్ క్రికెటర్​గా గుర్తింపు తెచ్చుకుంటే సంపాదనలోనూ ఏలాంటి లోటు ఉండదు. ఎండార్స్​మెంట్స్​, బిజినెస్ షేర్స్ ఇలా అన్నింట్లో వాళ్ల మార్క్ ఉంటుంది. అలా ఆయా క్రికెటర్లు​ కెరీర్​లో కోట్లు సంపాదిస్తుంటారు. మరి క్రికెట్​లో అత్యంత సంపన్న ప్లేయర్ ఎవరో మీకు తెలుసా?

Richest Cricketer World
Richest Cricketer World

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 8:37 PM IST

Richest Cricketer World: క్రికెట్ అంటే ఒకప్పుడు కేవలం ప్యాషన్ గేమ్. కానీ ఇప్పుడు కమర్షియల్ గేమ్ కిందకు మారిపోయింది. ఒకప్పుడు క్రికెట్ మీద ఇష్టంతో చాలామంది ఈ గేమ్‎లోకి వస్తే, ఇప్పుడు పేరుతో పాటు డబ్బు సంపాదనకు క్రికెట్ మార్గంగా మారింది. మరీ ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ రూపాన్ని పూర్తిగా మార్చి వేసిందనే చెప్పుకోవాలి. అప్పటి దాకా సిక్సర్లు, వికెట్లు అని మాట్లాడుకునే క్రికెట్ అభిమానులు, పలానా క్రికెటర్ ఐపీఎల్‎లో పలానా రేట్ పలికాడు అనే పరిస్థితి ఏర్పడింది.

టీమ్​ఇండియాకు చెందిన ఎంతోమంది క్రికెటర్లు ఓ వైపు క్రికెట్ ఆడుతూనే మరోవైపు రకరకాల యాడ్స్ చెయ్యడంతో పాటు సొంతంగా వ్యాపారాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సచిన్ తెందూల్కర్ లాంటి ఎంతోమంది క్రికెటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్నుడైన క్రికెటర్ ఎవరంటే టక్కున ధోనీ, విరాట్, రోహిత్, సచిన్ పేర్లు చెబుతారు. దాదాపు అందరి సమాధానం ఇదే ఉంటుంది. కానీ, ఓ యంగ్ క్రికెటర్​ వీరికంటే అనేక రెట్లు ఎక్కువ నెట్​వర్త్ కలిగి ఉన్నాడు. అతడే ఆర్యమాన్ బిర్లా. ఈ క్రికెటర్ ఎవరు? అతడి ఆస్తి విలువ ఎంత?

ఆర్యమాన్ బిర్లా ఎవరంటే:క్రికెట్ పరంగా అభిమానులకు పెద్దగా పరిచయం లేని ఆర్యమాన్ బిర్లా. అతడు ప్రముఖ వ్యాపార దిగ్గజం కుమార్ మంగళం బిర్లా కుమారుడు. ఆయన 'ఆదిత్య బిర్లా గ్రూప్' సంస్థల యజమానీ. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా తన వ్యాపారాన్ని విస్తరించిన కుమార్ మంగళం బిర్లా దేశంలోని టాప్ బిజినెస్​మేన్​ జాబితాలో ఒకరు. క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో ఆర్యమాన్ బిర్లా క్రికెటర్‎గా మారి కొన్నాళ్ల పాటు గ్రౌండ్‎లో మెరిశాడు.

బిర్లా ఆస్తి విలువ ఎంతంటే: వ్యాపార దిగ్గజం కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమాన్ బిర్లాకు వారసత్వంగా వచ్చే ఆస్తి భారీ మొత్తంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. కుమార్ మంగళం బిర్లా ఆస్తుల విలువ దాదాపు రూ.1.5లక్షల కోట్లు ఉండగా వారసత్వంగా ఆర్యమాన్ బిర్లాకు దాదాపు రూ.70,000కోట్లు రానున్నట్లు తెలుస్తోంది. ఇది కోహ్లీ, ధోనీ, సచిన్, రోహిత్ శర్మ లాంటి ఎంతోమంది క్రికెటర్ల ఆస్తుల విలువ కన్నా చాలారెట్లు ఎక్కువ.

బిర్లా క్రికెట్ ప్రస్థానం ఇది:ఆర్యమాన్ 2019లో మధ్యప్రదేశ్ టీమ్​తో క్రికెట్‎లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత్​ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్​లోనూ బిర్లా ఆడాడు. అతడు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున 16 ఇన్నింగ్స్ ఆడిన ఆర్యమాన్ 414 పరుగులు చేశాడు. ఇందులో ఆర్యమాన్ ఓ సెంచరీ సైతం బాదాడు. 2019 డిసెంబర్‎లో క్రికెట్ కెరీర్‎కి గుడ్ బై చెప్పిన ఆర్యమాన్ తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు.

బిజినెస్​లోనూ రోహిత్ మార్క్​- హిట్​మ్యాన్ నెట్​వర్త్​ ఎంతో తెలుసా?

Richest IPL Captains: అత్యంత సంపన్న కెప్టెన్​గా ధోనీ.. మిగిలిన వారు ఏ ప్లేస్ అంటే​ ?

ABOUT THE AUTHOR

...view details