Cricketer Who Rented Home To Virat Kohli : భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్లు జాబితాలో సచిన్, ధోనీ, కోహ్లీ పేర్లు ముందు వరుసలో వినిపిస్తుంటాది. అయితే వీరి కన్నా సంపన్న క్రికెటర్ ఒకరు ఉన్నారు. అయితే ఆయన టీమ్ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించలేదు. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆయన స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీకి తన ఇంటిని అద్దెకు ఇచ్చేంత రేంజ్‌కు వెళ్లారు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరంటే?
ఈయన మాజీ రంజీ క్రికెటర్!
గుజరాత్‌లోని బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్జిత్ రంజిత్ సిన్హ్ గైక్వాడ్. ఈయన ఆస్తి విలువ సుమారు రూ.20,000 కోట్లకు పైమాటే అని సమాచారం. అయితే ఈ ఆస్తి ఆయనకు ఎండార్స్మెంట్లు, బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టుల వల్ల రాలేదట. వారసత్వంగా వచ్చినట్లు తెలుస్తోంది. వడోదర మహారాజు రంజిత్ సిన్హ్ ప్రతాప్ గైక్వాడ్ ఏకైక కుమారుడే ఈ సమర్జిత్ రంజిత్ సిన్హ్ గైక్వాడ్. 2012 మేలో తన తండ్రి మరణం తర్వాత సమర్‌జిత్‌కు మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. అందులో భాగంగానే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ సహా పలు విలువైన భవనాలు, ఆస్తులు సమర్ జిత్‌కు దక్కినట్లు సమాచారం.
బకింగ్‌హామ్ కంటే పెద్ద ప్యాలెస్!
అయితే ఆయన ఆస్తుల్లో ఒకటైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్, బకింగ్ హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు విశాలంగా ఉంటుందని సమాచారం. అలాగే గుజరాత్, బనారస్లలో 17 దేవాలయాలను, ట్రస్ట్‌లను కూడా నిర్వహిస్తున్నారు సమర్జిత్. అలాగే ఈయనకు ముంబయిలో పలు ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయట. అందులోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో టీమ్ఇండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కొన్నాళ్ల పాటు అద్దెకు ఉన్నారట.