తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆర్సీబీ ప్లే ఆఫ్​ ఆశలు గల్లంతు - ఒక్క పరుగు తేడాతో కోల్​కతా విజయం - IPL 2024 - IPL 2024

RCB Vs KKR IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

RCB Vs KKR IPL 2024
RCB Vs KKR IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 7:41 PM IST

Updated : Apr 21, 2024, 9:54 PM IST

RCB Vs KKR IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. బెంగళూరు ప్లేయర్లు విల్​ జాక్స్​ (55), రజత్ పటీదార్ (52) లాంటి స్టార్స్​ రాణించినప్పటికీ కోల్‌కతా నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. ఇక కోహ్లీ(18), డుప్లెసిస్‌(7), గ్రీన్‌(6), లమ్రార్‌(4) నిరాశపర్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. చివరిలో దినేశ్‌(25), కర్ణ్‌శర్మ(20) పరుగులు చేసినప్పటికీ ఆ ఇన్నింగ్స్ వృథా అయిపోయింది. ఇక కోల్‌కతా బౌలర్లలో రసెల్‌ 3 వికెట్లు పడగొట్టగా, హర్షిత్‌ రాణా, సునీల్‌ నరైన్‌ చెరో 2, వరుణ్‌ చక్రవర్తి, స్టార్క్‌ తలో ఒక వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు సాధించింది. ఓపెనర్‌ సాల్ట్‌ (48); చెలరేగాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ (50) కూడా అర్ధశతకంతో రాణించాడు. రింకూ సింగ్‌ (24), రసెల్‌ (27*), రమణ్‌దీప్‌ (24*) ఫర్వాలేదనిపించారు. ఇక నరైన్‌ (10), రఘువంశీ (3), వెంకటేశ్‌ అయ్యర్‌ (16) నిరాశపరిచారు. బెంగళూరు బౌలర్లలో యశ్‌ దయాల్‌, గ్రీన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, ఫెర్గూసన్‌ తలో వికెట్‌ తీశారు.

థర్డ్​ అంపైర్ ఫెయిర్ రివ్యూ - కాంట్రవర్సీగా విరాట్ ఔట్​!

ఇక ఈ మ్యాచ్ వేదికగా ఓ వివాదాస్పద ఘటన జరిగింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(18) ఔట్​ అయినతీరు కాస్త కాంట్రవర్సీగా మారింది. హర్షిత్‌ రాణా వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికి అతనికే క్యాచ్‌ ఇచ్చాడు. అయితే, ఆ బాల్​ను ఫుల్ టాస్ రూపంలో కాస్త ఎత్తులో రావడం వల్ల అసలు గొడవ మొదలైంది. నో- బాల్ కోసం కోహ్లీ రివ్యూ తీసుకున్నప్పటికీ, నిర్ణయం అతనికి వ్యతిరేకంగానే వచ్చింది. అయితే థర్డ్ అంపైర్ ఆ బంతిని ఫెయిర్ డెలివరిగా నిర్ణయిస్తూ, కోహ్లీని ఔట్​గా డిక్లేర్ చేశారు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై విరాట్, డుప్లెసిస్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో చర్చించిప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.

'ఆర్సీబీలో సగం మందికి ఇంగ్లీష్ కుడా రాదు' - IPL 2024 RCB

ఆర్సీబీ ప్లే ఆఫ్స్​ ఆశలు- బెంగళురుకు ఛాన్స్ ఉందా? - RCB Playoff Chances IPL 2024

Last Updated : Apr 21, 2024, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details