Rishabh Pant RCB: 2025 ఐపీఎల్లో ఛాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా దిల్లీ క్యాపిటల్స్ జట్టులో మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే జట్టుకు కొత్త డైరెక్టర్, హెడ్‌కోచ్‌ను నియమించుకుంది. ఇక కెప్టెన్సీలో కూడా మార్పు చేయాలని యాజమాన్యం భావిస్తోందట. ఇందులో భాగంగానే వర్క్‌లోడ్ తగ్గించేందుకు రిషభ్ పంత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, జట్టుకు కొత్త సారథిని నియమించాలని ప్లాన్ చేస్తోందట.
కానీ, పంత్ మాత్రం కెప్టెన్సీ కావాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి ఫ్రాంచైజీ యాజమాన్యం ఒప్పుకోకపోవడం వల్ల పంత్ దిల్లీని వీడనున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంత్‌పై కన్నేసినట్లు సమాచారం. దిల్లీ నుంచి పంత్ బయటకు వస్తే, అతడిని దక్కించుకునేందుకు ఆర్సీబీ ప్రయత్నాలు ప్రారంభించిందట. అతడు వేలంలోకి వస్తే ఎలాగైనా దక్కించుచుకోవాలని ఆర్సీబీ నిర్ణయిచుకున్నట్లు తెలిసింది.
అయితే ప్రధానంగా మూడు కారణాల వల్లే ఆర్సీబీ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. మరి ఆ మూడు రీజన్స్ ఏంటో చూద్దాం
కెప్టెన్సీ :పంత్‌ను జట్టులోకి తీసుకోవాలనుకోవడంలో ప్రధాన కారణం కెప్టెన్సీ. పంత్‌కు ఐపీఎల్లో జట్టును నడిపించిన అనుభవం ఉంది. అతడు దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పలు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ జట్టను సమర్థంగా నడపగలడు.