Ind vs Eng T20 Series :ఇంగ్లాండ్‌పై వరుస టీ20ల విజయాలతో టీమ్ఇండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టుపై 2- 0 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉండడంతో సంబరపడుతున్నారు. కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకో తెలుసా?
భారీ ధర
ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్‌ను దక్కించుకుంది. సాల్ట్‌ను రూ.11.50 కోట్లు, లివింగ్ స్టోన్‌ను రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ ఇద్దరూ తమ జట్టు తరఫున రాణిస్తారని ఆర్సీబీ భావించింది. అయితే టీమ్ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మాత్రం సాల్ట్, లివింగ్ స్టోన్ ఘోరంగా విఫలమవుతున్నారు. తొలి టీ20లో ఇద్దరూ సున్నాకే పెవిలియన్ చేరగా, రెండో మ్యాచ్‌లో సాల్ట్ (4 పరుగులు), లివింగ్ స్టోన్ (13 పరుగులు) స్వల్ప స్కోర్లకే ఔట్ అయ్యారు.
వాళ్లు ఆందోళనలో
వేలంలో తమ జట్టులోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఫిల్ సాల్డ్, లివింగ్ స్టోన్పై ఆర్సీబీ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే భారత గడ్డపై మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతుండడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. రెండు నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2025 సీజన్లో వీరు ఎలా రాణిస్తారోనని ఆందోళన పడుతున్నారు.