Ranji Trophy 2024 25 :రంజీ ట్రోఫీ 2024- 25 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. ఈ ప్రతిష్ఠాత్మకమైన డొమెస్టిక్ టోర్నీకి శుక్రవారం (అక్టోబర్ 11) రంజీ ట్రోఫీకి తెరలేవనుంది. తొలిరోజు హైదరాబాద్ జట్టు గుజరాత్‌తో తలపడనుంది. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ నేతృత్వంలో సత్తా చాటేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. అటు తిలక్ కూడా ఈ సీజన్‌లో తనదైన మార్క్ వేయాలని భావిస్తున్నాడు. మరోవైపు ఆంధ్ర జట్టు విదర్భతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ నాగ్‌పుర్ వేదికగా జరగనుంది. స్టార్ ప్లేయర్లు హనుమ విహారి, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ టీమ్ఇండియాలో రీ ఎంట్రీ కోసం కష్టపడనున్నారు.
కాస్త కొత్తగా: గత సీజన్లలో రంజీ టోర్నమెంట్ ఒకే దశలోనే జరిగేది. అయితే ఈ సారి రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 13 మధ్య తొలి దశ, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు రెండో దశ జరగనుంది.
Mumbai 42nd Title: కాగా, 2024 రంజీ సీజన్‌లో ముంబయి విజేతగా నిలిచింది. దీంతో 42వ సారి టైటిల్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు అత్యధిక (42)సార్లు రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న జట్టుగా ముంబయి రికార్డు కొట్టింది.
బరిలోకి సూర్య
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ రంజీలో ఆడనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత తాను రంజీకి అందుబాటులో ఉండనున్నట్లు ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చాడట. దీంతో అక్టోబర్ 18న ప్రారంభమయ్యే ముంబయి- మహారాష్ట్ర మ్యాచ్‌లో సూర్య ఆడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఫార్మాట్ ఇదే?
రంజీ ట్రోఫీలో 38 జట్లు ఉన్నాయి. వీటిని ఐదు (ఎలైట్, ప్లేట్) గ్రూపులుగా విభజించారు. ఎలైట్ A, B, C, D. ఈ నాలుగు గ్రూపుల్లో ఒక్కోదానిలో ఎనిమిది జట్లు ఉంటాయి. ప్లేట్ గ్రూప్‌లో ఆరు జట్లు ఉంటాయి. ఈ క్రమంలో ఓ టీమ్ తమ గ్రూపులోని ప్రతి ఇతర జట్లతో ఆడుతుంది. ప్రతి గ్రూప్‌కి సొంత పాయింట్ల పట్టిక ఉంటుంది. ప్రతి ఎలైట్ గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ స్టేజ్‌కి చేరుకొంటాయి. ఇందులోనే క్వార్టర్, సెమీ ఫైనల్స్ ఉంటాయి. ఈ స్టేజీలను దాటిన టీమ్‌లు తదుపరి దశకు వెళ్తాయి. ప్లేట్ గ్రూప్‌లో మొదటి రెండు జట్లు తర్వాత సీజన్‌లో ఎలైట్ గ్రూప్‌కి అర్హత సాధిస్తాయి. ఎలైట్ గ్రూపుల్లో చివర నిలిచిన రెండు జట్లను ప్లేట్ గ్రూప్‌లో చేరుస్తారు.
కొత్త ఫార్మాట్‌లో జరగనున్న రంజీ ట్రోఫీ - బీసీసీఐ చేసిన కీలక మార్పులు ఇవే!
2024 రంజీ ఫైనల్లో 'ముంబయి'దే హవా- 42వ టైటిల్ కైవసం