తెలంగాణ

telangana

ETV Bharat / sports

25వ రంజీ సెంచరీ బాదిన పుజారా - బ్రియాన్ లారా రికార్డ్ బ్రేక్

రంజీలో 25వ శతకం బాదిన పుజారా - ఫస్ట్ క్లాస్ కెరీర్​లో 66వ సెంచరీ - టీమ్ ఇండియాలో చోటు కోసం ప్రయత్నాలు

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Pujara ranji trophy
Pujara ranji trophy (source Getty Images and IANS)

Pujara Ranji Trophy Century : టీమ్ ​ఇండియాకు దూరమైన స్టార్ బ్యాటర్​ ఛతేశ్వర్‌ పుజారా తాజాగా రంజీ ట్రోఫీలో చెలరేగిపోయాడు. సోమవారం రాజ్ కోట్ వేదికగా ఛత్తీస్ గఢ్ - సౌరాష్ట్రకు మధ్య జరిగిన రంజీ మ్యాచ్​లో శతక్కొట్టాడు. దీంతో పుజారా తన ఖాతాలో 25వ రంజీ ట్రోఫీ శతకాన్ని వేసుకున్నాడు. ఓవరాల్​గా ఫస్ట్ క్లాస్ కెరీర్​లో ఇది అతనికి 66వ శతకం.

లారా రికార్డు బ్రేక్! -పుజారా 197 బంతుల్లో సెంచరీ మార్క్​ను అందుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చత్తీస్ గఢ్ 578 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన సౌరాష్ట్ర నిలకడగా ఆడుతోంది. పూజారా సెంచరీతో చేయడం వల్ల మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో సెంచరీల్లో(65) విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను పుజారా అధిగమించాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన నాలుగో భారత క్రికెటర్​గా పుజారా రికార్డుకెక్కాడు. పూజారా 273 మ్యాచుల్లో 21,000 పరుగులు బాదాడు.

  • అత్యధిక ఫస్ట్ క్లాస్ సెంచరీలు చేసిన టీమ్ ఇండియా ప్లేయర్లు
    సునీల్ గావస్కర్ - 81
    సచిన్ తండూల్కర్ - 81
    రాహుల్ ద్రవిడ్ - 68
    ఛతేశ్వర్‌ పుజారా - 66

    అత్యధిక ఫస్ట్ క్లాస్ పరుగులు చేసిన టీమ్ ఇండియా ప్లేయర్లు
    సునీల్ గవాస్కర్ - 25834
    సచిన్ టెండూల్కర్ - 25396
    రాహుల్ ద్రవిడ్ - 23784
    ఛతేశ్వర్‌ పుజారా - 21015* –

    రంజీల్లో అదరగొడుతున్న పుజారా
    ఇక పుజారాను భారత టెస్టు జట్టు నుంచి తప్పించి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్​లో చివరిసారిగా టీమ్​ఇండియా తరఫున ఆడిన ఈ స్టార్ ప్లేయర్ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో విఫలమయ్యాడు. దీంతో పుజారాపై వేటుపడింది. అయితే దేశవాళీ క్రికెట్​లో సొంత జట్టు సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత రంజీ సీజన్​లో 8 మ్యాచుల్లో 69.08 సగటుతో 829 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్​ కౌంటీల్లోనూ సెంచరీలు కొడుతూ తన ఫామ్​ను నిరూపించుకుంటూనే ఉన్నాడు.

    ఛాంపియన్స్ ట్రోఫీ - పాక్​ 'దిల్లీ' ప్రపోజల్​కు బీసీసీఐ నో

వాషింగ్టన్ సుందర్‌ ఎంపిక వెనుక గంభీర్ ప్లానింగ్‌ ఇదే!

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details