ETV Bharat / state

ఈ కోర్సులు చదువుతున్నారా? - ఐతే ఉద్యోగమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది!

బీబీఏ, బీసీఏ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌ - ఉద్యోగావకాశాలు మెండుగా ఉండటమే ప్రధాన కారణం - ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సైతం ఈ కోర్సుల ప్రవేశం

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Increasing Demand for BBA And BCA Courses
Increasing Demand for BBA And BCA Courses (ETV Bharat)

Job Opportunities With BBA And BCA Courses : డిగ్రీ కోర్సుల్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌కు ఆదరణ పెరుగుతోంది. మిగతా కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, ఈ రెండింటిలో చేరే వారి సంఖ్య గత నాలుగేళ్లుగా పైపైకి పోతోంది. కొత్త కోర్సులు అందుబాటులోకి రావడం, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగాల్లో ఆయా కోర్సులు చదివిన వారికి ఉద్యోగావకాశాలు మెండగా ఉండటమే ప్రధాన కారణమని, రాబోయే రోజుల్లో బీబీఏకు ఆదరణ మరిత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బీకాంలో క్రమంగా తగ్గుతున్న చేరికలు : గత కొన్ని సంవత్సరాలుగా అత్యధిక మంది చేరే కోర్సుల్లో బీకాం అగ్రస్థానంలో నిలుస్తుండగా, క్రమంగా ఆ పరిస్థితి మారుతోంది. దోస్తు గణాంకాలను పరిశీలిస్తే ఆ కోర్సుల్లో ప్రవేశాల సంఖ్య క్రమంగా తగ్గుతుండడం స్పష్టంగా కన్పిస్తుంది. బీఎస్‌సీ లైఫ్ సైన్స్, ఫిజికల్‌ సైన్స్‌తో పాటు బీఏలోనూ విద్యార్థుల చేరికలు తగ్గుతూ వస్తోంది.

ఇంజినీరింగ్‌ కాలేజీల్లోనూ ఆ కోర్సులు : బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ సంస్థల్లో ఉద్యోగాలు అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. సాఫ్ట్‌వేర్‌ నిపుణులకూ ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నట్లు విద్యా నిపుణులు చెబుతున్నారు. అందుకే రాష్ట్రం ప్రభుత్వం ఈ ఏడాది ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలల్లో బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సును తీసుకువచ్చింది.

ఇకపై BCAలోనూ స్పెషలైజేషన్లు - బీటెక్​ తరహాలో ఏఐ, ఎమ్​ఎల్​, డేటా సైన్స్​ తదితర కోర్సులు - Specializations In BCA

సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఉన్నవారికి ఐటీ సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. మంచి ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తున్నాయి. బీబీఏ, బీసీఏ అనేవీ నైపుణ్యంతో కూడిన కోర్సులు. అందుకు ఏఐసీటీఈ కూడా ఈ విద్యా సంవత్సరంలో ఆ కోర్సులను తన పరిధిలోకి తెచ్చిందని హెచ్‌సీయూ మాచీ ప్రో ఛాన్సలర్‌, మేనేజ్‌మెంట్‌ విభాగం సీనియర్‌ లెక్చరరర్‌ బెల్లంకొండ రాజశేఖర్‌ తెలిపారు.

బీబీఏలో పలు స్పెషలైజేషన్లు : బిజినెస్‌పైన అవగాహన ఉన్న బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు ఐటీ కంపెనీలు కూడా మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇస్తున్నాయి. అందుకే ఇటీవల కాలంలో విద్యార్థులు పీజీ చదివేందుకు ఆసక్తి కనుబరచడం లేదు. ఎంటెక్‌ సహా సంప్రదాయ పీజీ కోర్సుల్లోనూ చేరడం లేదు. అదే సమయంలో ఎంబీఏలో ఏటా కనీసం 30మంది విద్యార్థులు చేరుతున్నారు.

బీకాం తదితర సంప్రదాయ కోర్సులు చదివిన తర్వాత ఎంబీఏ చేయడం కంటే బీబీఏ చేసి, ఎంబీఏ చడవడం మంచిదన్న భావనతలో ఎక్కువ మంది అటువైపు వెళ్తున్నారని లయోల డిగ్రీ కాలేజీ డీన్‌ డాక్ట్‌ర్ మర్రి వీరస్వామి తెలిపారు. అవినాష్‌ కామర్స్‌ కాలేజీ డీన్ డాక్టర్‌ కండూరి సుశీల మాట్లాడుతూ బీబీఏలో పలు స్పెషలైజేషన్లు వస్తున్నాయని, ఈ కారణంగానే సంస్థలు ఈ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు.

బంధాలు నేర్పే బడి వచ్చేసింది - ఇక ఆన్​లైన్​ విధానంలోనూ షురూ - Family and Marriage Counseling

YUVA : ''లా' అంటే కోర్టుల్లో వాదించడమే కాదు - అందులోనూ ఎన్నో వినూత్న కోర్సులున్నాయ్' - NALSAR UNIVERSITY VC INTERVIEW

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.