Rahul Dravid Rajasthan Royals : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు ప్రముఖ ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. అంతేకాకుండా ఆయనకు రాజస్థాన్ జట్టుకు సంబంధించిన స్పెషల్ జెర్సీ ఇచ్చి సత్కరించింది. ఇక టీమ్ ఓవరాల్ స్ట్రాటజీపై మార్గనిర్దేశం చేసేందుకు ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కరతో కలిసి ద్రవిడ్ వెంటనే పనిచేయడం ప్రారంభిస్తారని ప్రకటించింది. దీంతో రాజస్థాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
రాజస్థాన్ రాయల్స్‌లోకి తిరిగొచ్చిన ద్రవిడ్
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ద్రవిడ్‌కి ప్రత్యేక అనుబంధం ఉంది. 2011 నుంచి 2015 వరకు ఫ్రాంచైజీతో గడిపారు. 2012-13 మధ్య రెండేళ్లపాటు కెప్టెన్‌గా కొనసాగారు. రిటైర్ అయ్యాక రెండేళ్లపాటు రాజస్థాన్‌కు మెంటార్‌గానూ సేవలు అందించారు.
విజయవంతమైన కోచింగ్ కెరీర్
ద్రవిడ్ హయాంలో టీమ్ ఇండియా చాలా ఐసీసీ ట్రోఫీలకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఎట్టకేలకు ద్రవిడ్ చివరి అవకాశంలో ఇండియా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించింది. ద్రవిడ్ భారత జట్టును రెండో T20 ప్రపంచ కప్ అందించాడు. ఘనంగా వీడ్కోలు తీసుకున్నారు. ద్రవిడ్ ఇండియా U-19 జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) అధిపతిగా వ్యవహరించారు.