Rahul Dravid Biopic:భారత స్టార్ క్రికెటర్ల జీవిత కథ ఆధారంగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌లు తీసే ట్రెండ్ ఎప్పుడో ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లు తెరకెక్కి సక్సెస్ అయ్యాయి. తాజాగా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బయోపిక్ కూడా తీయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌లో పాల్గొన్న ద్రవిడ్‌కు తన బయోపిక్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ద్రవిడ్ ఇంట్రెస్టింగ్గా రిప్లై ఇచ్చాడు.
'మీ బయోపిక్ ఎప్పుడు? అందులో రాహుల్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది?' అని ఈవెంట్ హోస్ట్ ద్రవిడ్‌ను అడిగారు. దీనికి రాహుల్ స్పందిస్తూ ఎవరో ఎందుకు! డబ్బులిస్తే నేనే చేస్తా అని తన స్ట్రైల్లో జవాబిచ్చాడు. 'నాకు భారీ మొత్తంలో డబ్బులిస్తే, నా పాత్రలో నేనే నటిస్తా' అని రాహుల్ సమాధానమిస్తూ, ఈవెంట్లో నవ్వులు పూయించాడు. కాగా, ఇదే ఆవార్డ్స్ ఈవెంట్లో రాహుల్‌కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డ్ దక్కింది.