Paris Olympics 2024 Vinesh Phogat Plea Cancelled :పారిస్ ఒలింపిక్స్ 2024 రెజ్లింగ్‌లోభారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు పతకం వస్తుందా లేదా అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫోగాట్‌పై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ వేసిన అనర్హత వేటు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అయితే అనర్హత వేటును సవాలు చేస్తూ వినేశ్ ఫోగాట్ చేసిన అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) స్వీకరించింది. వినేశ్ తరఫున వాదనలు వినిపించేందుకు భారత ప్రభుత్వ మాజీ సొలిసిటర్ జనరల్ హరిష్ సాల్వే కూడా సిద్దమయ్యారు. దీనిపై తీర్పును ఇవాళ (ఆగస్టు 9న) వస్తుందని చెప్పారు. కానీ అది జరగలేదు. క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పును ఆగస్టు 13కు వాయిదా వేసినట్లు ప్రకటించింది. అందుకే వినేశ్‌కు పతకం వస్తుందా లేదా అంశంపై ఉత్కంఠకు తెర పడలేదు.
అప్పీలులో వినేశ్ ఏం కోరిందంటే? -ఈవిశ్వ క్రీడల్లో భారత్‌కు ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు. అయితే భారత్‌కు ఈ సారి గోల్డ్ మెడల్ వినేశ్ ఫోగాట్ రూపంలో వస్తుందని అంతా ఆశించారు. ఎందుకంటే గత ఒలింపిక్స్‌లో క్వార్టర్‌లో వైదొలిగిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఈ సారి పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం చెలరేగి ఆడింది. మాజీ ఛాంపియన్‌ను కూడా ఓడించి ఒక్కో దశ దాటుకుంటూ 50 కేజీల ఫ్రీ స్టైయిల్ రెజ్లింగ్ మహిళల విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. అలా అర్హత సాధించిన వినేశ్ మరికొన్ని గంటల్లో ఫైనల్‌లో అమెరికా రెజ్లర్‌తో తలపడాల్సి ఉంది.