Paris Olympics 2024 Manu Bhaker : ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను బాకర్ చరిత్ర సృష్టించడంతో హరియాణ సూరజ్‌కుండ్‌లోని మను బాకర్ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌తో కలిసి మనూ పతకం సాధించింది. ఈ విజయం అనంతరం మను బాకర్ ఇంటికి బంధువులు, శ్రయాభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఒలింపిక్స్‌లో మను బాకర్ విజయాల వెనక రానా - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024
Paris Olympics 2024 Manu Bhaker : భారతదేశం గర్వించేలా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను బాకర్ చరిత్ర సృష్టించింది. దీంతో మను ఇంట్లో పాటు ఆమె స్వగ్రామంలో సంబరాలు జరుగుతున్నాయి. అయితే మను విజయానికి కారణం రానా అని తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో

Published : Jul 30, 2024, 8:01 PM IST
అయితే ఒలింపిక్స్‌లో మను బాకర్ అద్భుత ప్రదర్శన వెనక ఓ వ్యక్తి ఉన్నారు! ఆయనే మను బాకర్ కోచ్ జస్పాల్ రానా. తన కోచ్ జస్పాల్ రాణాను చూస్తే తనకు ఎంతో ధైర్యం వస్తుందని, అందుకే ఫైనల్ జరిగేటప్పుడు ఆయన్ను తప్ప ఇంకెవర్నీ చూడొద్దని గట్టిగా నిర్ణయించుకున్నానని కాంస్య పతకం సాధించిన అనంతరం మను బాకర్ వ్యాఖ్యానించింది. జస్పాల్ తన తండ్రిలాంటి వారని భావోద్వేగానికి గురైంది.
రాణా రాకతో ఆత్మ విశ్వాసం - పారిస్‌లో తన కుమార్తె సాధించిన దాని వెనక కోచ్ జస్పాల్ రానా ఉన్నాడని మను బాకర్ తండ్రి రామ్ కిషన్ తెలిపారు. "రాణాతో జట్టు కట్టిన తర్వాత మను బాకర్ ఆత్మ విశ్వాసం రెట్టింపు అయింది. ఇప్పుడు మను పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. తను విజయం సాధించిన తర్వాత నేను చాలా సేపు మాట్లాడలేకపోయాను. ఇది భారత్‌కు దక్కిన పెద్ద విజయం. జస్పాల్ రాణా ఒక గొప్ప షూటర్. అతనితో కలిసి పని చేస్తున్నప్పటి నుంచి బాకర్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మంచి ఫలితాలు వస్తున్నాయి. మను ప్రయత్నం, జస్పాల్ ఆశీర్వాదం. విజయానికి దోహదపడ్డాయి." అని రామ్ కిషన్ అన్నారు. "దేశానికి రెండు కాంస్య పతకాలు దక్కాయి. మను అంచనాలను అందుకుంది. సరబ్‌జోత్ లేకుండా రెండో కాంస్య పతకం దక్కేది కాదు. సరబ్‌జోత్ అసలు ఒత్తిడిలో ఉన్నట్లే కనిపించలేదు" అని మను బాకర్ తండ్రి రామ్ కిషన్ పేర్కొన్నారు.