- బ్యాడ్మింటన్ సెమీస్‌లో లక్ష్య సేన్ పరాజయం
- డెన్మార్క్ ఆటగాడు అక్సెల్సెన్ చేతిలో లక్ష్య సేన్ ఓటమి
Paris Olympics : సెమీస్‌లో లక్ష్య సేన్ పరాజయం - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Published : Aug 4, 2024, 12:29 PM IST
|Updated : Aug 4, 2024, 4:26 PM IST
Paris Olympics 2024 Live Updates:పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో మూడు కాంస్యాలు మాత్రమే చేరాయి. అవన్నీ షూటింగ్లో రావడం విశేషం. ఇక ఆదివారం (ఆగస్టు 4) భారత్ అథ్లెట్లు కీలకమైన ఈవెంట్స్ ఆడనున్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ సెమీఫైనల్ ఆడనుండగా, మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా క్వార్టర్ ఫైనల్లో బరిలో దిగనుంది. ఈ రెండు మేజర్ ఈవెంట్లతోపాటు ఆదివారం జరగనున్న పలు క్రీడల అప్డేట్స్ మీ కోసం!
LIVE FEED
తాజాగా జరిగిన బాక్సింగ్ 75 కేజీల క్వార్టర్‌ఫైనల్ ఈవెంట్లో భారత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ ఓటమిపాలైంది. చైనాకు చెందిన లీ కియాన్ చేతిలో 1-4 తేడాతో ఓడిండి. దీంతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది.
ఒలింపిక్స్‌లో భాగంగా తాజాగా జరిగిన హాకీ క్వార్టర్స్‌లో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. దీంతో సెమీస్‌కు చేరుకుంది.
- క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సగం సమయం పూర్తి
- ఫస్ట్ హాఫ్‌లో 1-1తో సమానంగా నిలిచిన భారత్- గ్రేట్ బ్రిటన్
- క్వార్టర్స్‌లో గ్రేట్ బ్రిటన్‌తో తలపడుతున్న భారత హాకీ జట్టు
- తొలి గోల్ కొట్టిన టీమ్ఇండియా
- 1-0లీడ్‌లో భారత్
- స్టీపుల్ చేజర్లో పోరాడి ఓడిన పారుల్ చౌదరి
- 3000మీటర్ల రేస్‌లో 8వ స్థానం దక్కించుకున్న పారుల్
- 9:23.39 నిమిషాల్లో రేస్ పూర్తి చేసిన పారుల్
- ఈ ఓటమితో ఫైనల్ రేస్ నుంచి పారుల్ ఔట్
- టాప్-6లో ఉన్న అథ్లెట్లు ఫైనల్‌కు క్వాలిఫై
- బాక్సింగ్ (75కేజీలు) క్వార్టర్స్‌లో లవ్లీనా బొర్గోహెయిన్
- లి క్వియాన్ (చైనా)తో తలపడనున్న లవ్లీనా
- మధ్యాహ్నం 3.02 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీస్‌లో లక్ష్యసేన్
- వరల్డ్ నెం.2 విక్టర్ ఆక్సెల్సెన్ (డెన్మార్క్)తో మ్యాచ్
- మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం