Paris Olympics 2024 Indian Athlete Records : పారిస్ ఒలింపిక్స్ 2024 ఈవెంట్లో ఇండియా ఆరు పతకాలు సాధించింది. వినేశ్ పోగట్ విషయంలో కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ నుంచి సానుకూల తీర్పు వెలువడితే పతకాల సంఖ్య ఏడుకు చేరే అవకాశముంది. టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే పతకాల సంఖ్యలో ఇండియా కాస్త వెనుకపడినా ఈ సారి కాస్త మెరుగైన సంఖ్యను కనబరిచింది. స్వర్ణం తీసుకొస్తాడని ఎదురుచూసిన నీరజ్ చోప్రా కాంస్యంతో సరిపెట్టుకోగా రీతికా హూడా లాంటి రెజ్లర్ ఎలిమినేట్ అవడం తీవ్రంగా నిరాశపరిచింది.
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా పర్ఫార్మెన్స్
1 - స్వాతంత్య్రానంతరం ఒకే ఎడిషన్‌లో మల్టీపుల్ మెడల్స్(రెండు) సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచారు మను బాకర్. 1900వ సంవత్సరం నార్మన్ ప్రిచర్డ్ కూడా ఈ ఘనత సాధించారు. ఈ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం, మిక్స్‌డ్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో సరబ్ జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యాన్ని గెలుచుకొని రికార్డు సృష్టించింది.
2 - టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన మీరా బాయి చాను మల్టిపుల్ మెడల్స్ దక్కించుకున్న నీరజ్ చోప్రా, మను బాకర్, హాకీ టీం జాబితాలో చేరే అవకాశాన్ని 2 కేజీల దూరంలో చేజార్చుకుంది. 114 కేజీలను ఎత్తాల్సి ఉండగా చివరిగా వేసిన 2 కేజీల బరువును ఎత్తలేక పోయింది.
6 - మను బాకర్ - సరబ్జోత్ సింగ్, స్పప్నిల్ కుశాలె, ఇండియన్ మెన్స్ హాకీ టీం, నీరజ్ చోప్రా అమన్ సెహ్రవత్లు భారతదేశానికి ఆరు పతకాలను తెచ్చిపెట్టారు. వినేశ్ పతకం ఒకటి వచ్చే అవకాశముంది.
6 - అర్జున్ బబుటా, మీరాబాయి చాను, లక్ష్యసేన్, అనంత్ జీత్ సింగ్ నారుకా - మహేశ్వరీ చౌహాన్‌ల మిక్స్‌డ్ షూటింగ్ టీం, ఆర్చర్లు అంకితా భకత్ - ధీరజ్ బొమ్మదేవరలు పతకానికి ఒక్క అడుగు దూరంలో అంటే నాలుగో స్థానంలో నిలిచారు.
10 - పారిస్ ఒలింపిక్స్ వేదికగా హాకీలో భారత్‌కు కాంస్యం తెచ్చిపెట్టడంలో హర్మన్ ప్రీత్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. ఇండియా సాధించిన 15 గోల్స్‌లో 10 గోల్స్ హర్మన్ చేసినవే.
12 - భారత్ షూటింగ్‌లో 2012 తర్వాత అంటే మరో 12 ఏళ్ల అనంతరం తొలిసారిగా పతకాన్ని సాధించింది.
16- 2008వ సంవత్సరం రెజ్లర్ సుశీల్ కుమార్ రజతం సాధించాడు. అప్పటి నుంచి ఒలింపిక్స్‌లో వరుసగా ఈ ఈవెంట్లో పతకాలు వస్తున్నాయి. అలా ఈ సారి ఒలింపిక్స్‌లో రెజ్లర్ సెహ్రవాత్ పతకాన్ని సాధించి ఆనవాయితీని కొనసాగించాడు. దీంతో ఒలింపిక్స్ చరిత్రలో రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది ఎనిమిదో పతకం.