Armless Swimmer Wins Gold Paralympics :చేతులు లేకున్నా విలు విద్యలో సత్తా చాటి ప్రపంచాన్ని అబ్బురపరిచింది భారత పారా అథ్లెట్ శీతల్ దేవి. పారిస్ పారాలింపిక్స్‌లో మిక్స్డ్ ఆర్చరీ ఈవెంట్లో కాంస్యం ముద్దాడింది. కెరీర్లో ఎంతో కష్టపడి విశ్వక్రీడలపై సత్తా చాటిన శీతల్ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అచ్చం అలానే బ్రెజిల్‌కు చెందిన గాబ్రియేల్ గెరాల్డో డాస్ శాంటోస్ అరౌజో (dos SANTOS ARAUJO Gabriel Geraldo) కూడా రెండు చేతులు లేకున్నా స్విమ్మింగ్‌లో డాల్ఫిన్ వలే దూసుకెళ్తున్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో ఏకంగా మూడు గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నాడు గాబ్రియేల్
అందర్నీ ఆకట్టుకుంటూ!
Paralympics 2024 :22 ఏళ్ల బ్రెజిల్ అథ్లెట్ గాబ్రియేల్ ప్రస్తుత పారాలింపిక్స్‌లో తన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. 200 మీటర్ల ఫ్రీ స్టైయిల్ S2 విభాగంలో పోటీ పడ్డ గాబ్రియేల్, న్యూట్రల్ అథ్లెట్లు వ్లాదిమిర్ డానిలెంకో, చిలీ అల్బెర్టో అబర్జా డియాజ్‌ను వెనక్కినెట్టి తొలి స్థానంలో నిలిచాడు. గాబ్రియేల్ కేవలం 3:58.92 సెకండ్లలో టార్గెట్ పూర్తి చేసి పసిడి దక్కించుకున్నాడు. అలాగే 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ S2, 50 మీటర్ల S2 బ్యాక్‌స్ట్రోక్ విభాగాల్లోనూ గాబ్రియేల్ పసిడి పతకం నెగ్గాడు.