Pandya No Look Shot :బంగ్లాదేశ్‌తో జరురుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లా నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 11.5 ఓవర్లలోనే ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగే హైలైట్. హార్దిక్ (39 పరుగులు;16 బంతులు: 5x4, 2x6) సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్‌లో హార్దిక్ బాదిన ఓ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
12వ ఓవర్లో తస్కిన్ అహ్మద్ వేసిన బంతిని హార్దిక్ బౌండరీకి తరలించాడు. అయితే ఈ బౌండరీ బాదిన విధానానికి మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ ఓవర్లో మిడిల్ లైన్ అండ్ లెంగ్త్‌తో తస్కిన్ విసిరిన మూడో బంతిని క్రీజులో ఉన్న హార్దిక్, వెనుక వైపునకు జస్ట్ ఫ్లిక్ ఇచ్చాడు. అది కీపర్ తలపై నుంచి బ్యాక్‌సైడ్ బౌండరీకి వెళ్లింది. అయితే పాండ్య షాట్ బాదిన తర్వాత కనీసం ఆ బంతిని తిరిగి చూడలేదు కూడా. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో కామ్‌గా కనిపించాడు. దీంతో ఇది పాండ్య 'నో లుక్ షాట్' (Pandya Look Shot From) అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక అదే ఓవర్లో తర్వాత రెండు బంతులకు వరుసగా ఫోర్, సిక్స్ బాదిన పాండ్య మ్యాచ్‌ను 11.5 ఓవర్లలోనే ముగించాడు.
ఛేదనలో టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (16 పరుగులు, 7బంతుల్లో) ఇన్నింగ్స్ వేగంగా ఆరంభించినా త్వరగానే రనౌట్ అయ్యాడు. ఇక సంజూ శాంసన్ (29 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (29 పరుగులు) ఫర్వాలేదనిపించారు. డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న నితీశ్ రెడ్డి (16* పరుగులు) ఆకట్టుకున్నాడు.