తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బాత్​రూమ్​లు, సీట్లు సరిగ్గా లేవు!' పాక్ స్టేడియాల పరిస్థితిపై PCB ఛైర్మన్ - Champions Trophy 2025 - CHAMPIONS TROPHY 2025

Pakistan Cricket Stadiums: 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరగనుంది. అయితే అక్కడి స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవు. స్టేడియాల దుస్థితిపై పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఏమన్నాడంటే?

Pakistan Cricket Stadiums
Pakistan Cricket Stadiums (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Aug 19, 2024, 9:33 PM IST

Pakistan Cricket Stadiums:పాకిస్థాన్‌లోని స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాల మధ్య ఉన్న అంతరాన్ని పీసీబీ ఛైర్మన్ నఖ్వీ ఎత్తిచూపారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న స్టేడియాలు ఏవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా లేవని చెప్పారు. 'మా స్టేడియాలకు, ప్రపంచంలోని మిగిలిన స్టేడియాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఏ స్టాండర్డ్స్‌ పరంగానూ అవి అంతర్జాతీయ స్థాయి అనిపించుకోవు. స్టేడియాల్లో తగినన్ని సీట్లు లేదా బాత్‌రూమ్‌లు కూడా లేవు. స్టేడియంలో వ్యూని పరిశీలిస్తే 500 మీటర్ల దూరం నుంచి మ్యాచ్‌ చూస్తున్నట్లు అనిపించింది' అని చెప్పాడు.

ప్రధాన పునర్నిర్మాణ ప్రణాళికలు
ఈ సమస్యలను పరిష్కరించడానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ రెనోవేషన్‌ ప్రాజెక్టులు ప్రారంభించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలను అప్గ్రేడ్ చేయడంపై దృష్టి పెట్టింది. 2025 ఫిబ్రవరి- మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా సౌకర్యాలు కల్పించేందుకు రూ.12.8 బిలియన్లు అవసరం అవుతుందని అంచనా.

సకాలంలో పనులు పూర్తవుతాయా?
పనుల పురోగతిని సమీక్షించేందుకు గడ్డాఫీ స్టేడియంను నఖ్వీ సందర్శించాడు. రెనొవేషన్‌ పనులు సకాలంలో పూర్తవుతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (FWO) నిరంతరాయంగా శ్రమిస్తోందని ప్రశంసించాడు. 'మేము మా స్టేడియంలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం. స్టేడియాల్లో మౌలిక వసతులు కల్పించడం మా మొదటి ప్రాధాన్యత' అని నఖ్వీ చెప్పాడు.

భవనాన్నిహోటల్‌గా మార్చే ప్రణాళిక
స్టేడియాలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు సమీపంలోని భవనాన్ని హోటల్‌గా అభివృద్ధి చేయాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్​ భావిస్తోంది. అందులో గదులను క్రికెట్‌ టీమ్‌లకు కేటాయించవచ్చని పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లోని సంక్లిష్టతలను నఖ్వీ అంగీకరించాడు. అయితే ఇది టోర్నమెంట్‌కు ముందే పూర్తి కాగలదనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

పాక్‌లో ఐసీసీ జీఎం పర్యటన
కొన్ని నెలల క్రితమే ఐసీసీ జనరల్ మేనేజర్‌ వసీం ఖాన్‌ లాహోర్‌లో పర్యటించారు. ఆయన పర్యటన గురించి ఓ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారి మాట్లాడారు. 'వసీం ఖాన్ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఉన్నతాధికారులతో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఏర్పాట్లపై చర్చించారు. భారత జట్టు వీలైనంత తక్కువగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు' అని తెలిపారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి రూ.584 కోట్ల బడ్జెట్- ఎక్స్​ట్రా రూ.34 కోట్లు కూడా! - Champions Trophy 2025

పాకిస్థాన్ పర్యటనపై బీసీసీఐ ఆలోచన ఇదే - అదనపు నిధులు కేటాయించిన ఐసీసీ! - Champions Trophy 2025

ABOUT THE AUTHOR

...view details