Pak vs Nz 5th T20:న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఆక్లాండ్ వేదికగా ఆదివారం (జనవరి 21) జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో పాక్ 42 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో క్లీన్స్పీప్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో కివీస్ 17.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ఇఫ్తికార్ అహ్మద్ 3, షహీన్ అఫ్రిదీ, మహ్మద్ నవాజ్ తలో రెండు, జమర్ ఖాన్, ఉస్మాన్ మీర్ చెరో ఒక వికెట్ దక్కించుకున్నారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను అతిథ్య న్యూజిలాండ్ 4-1 తేడాతో నెగ్గింది.
అతడు పోవడం వల్లే!పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ జాకా అష్రఫ్ శనివారం (జనవరి 20) తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత పాక్ ఆడిన తొలి మ్యాచ్లోనే నెగ్గింది. దీంతో అష్రఫ్ పోవడం వల్లే పాక్ జట్టు విజయం సాధించిందని ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మళ్లీ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మంచి రోజులు వచ్చాయని కామెంట్ చేస్తున్నారు. 'నిన్న జాకా రిటైర్డ్ అయ్యాడు, నేడు పాక్ గెలిచింది' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, 'బోర్డుకు అష్రఫ్ రాజీనామా చేశాక పాక్ విన్నింగ్ పర్సెంటేజీ 100 శాతం' అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా ఏడు మ్యాచ్ల తర్వాత తొలిసారి గెలుపు రుచి చూసింది.