PAK VS CAN T20 World Cup 2024 :టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్ జట్టు ఎట్టకేలకు తమ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. జూన్ 11న జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల లక్ష్యాన్ని చేధించి కెనడాపై గెలిచింది. వాస్తవానికి పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ నుంచి కావాల్సింది విజయం మాత్రమే కాదు. భారీ రన్ రేట్ ఆధిక్యం కూడా ఎంతో అవసరం ఉంది. కానీ, లక్ష్య చేధనలో భాగంగా నెమ్మెదిగా పరుగులు చేయడం, 17.3 ఓవర్ల వరకూ ఆడాల్సి రావడం చూసి పాక్ సీనియర్ క్రికెటర్లు తిట్టిపోస్తున్నారు. ఇందులో భాగంగా పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మరోసారి ప్లేయర్లపై దుమ్మెత్తిపోశాడు.
"గ్రూపు స్టేజిలో తప్పక గెలవాల్సిన మ్యాచ్. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రమంలో కచ్చితంగా రన్ రేట్ అనేది భారీగా పెంచుకోవాలి. లక్ష్యాన్ని చేధించడానికి అంత ఆలస్యంగా ఎందుకు వ్యవహరించాలి. మిగిలిన జట్లు గ్రూపు దశలో ఇప్పటికే క్వాలిఫై అన్నట్లు టాప్ 2లో నిలిచాయి. పాకిస్థాన్‌కు 36 మంది కోచ్‌లు, టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. రన్ రేట్ ఎంత ప్రాముఖ్యమో స్వతహాగా తెలుసుకోవాలి. ప్రతీది పూసగుచ్చినట్లు చెప్పడం మా బాధ్యత కాదు. అదంతా డ్రెస్సింగ్ రూంలోనే చర్చించుకుంటే బాగుండేది" అంటూ వాసిమ్ అక్రమ్ పేర్కొన్నాడు.
కెనడాతో మ్యాచ్ జరగడానికి ముందు వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన పాకిస్థాన్ నెగెటివ్ రన్ రేట్ దక్కించుకుంది. మూడో మ్యాచ్ గెలవడం వల్ల రన్ రేట్లో మార్పు వచ్చి +0.191కు చేరింది. గ్రూపు దశలో చివరిదైన నాలుగో మ్యాచ్‌ను జూన్ 16న ఐర్లాండ్‌తో ఆడనుంది.
స్లోయెస్ట్ 50 :
కెనడాతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగి 53 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సుతో 53 పరుగులు చేశాడు మొహమ్మద్ రిజ్వాన్. అలా టీ20 వరల్డ్ కప్‌లో ఎక్కువ బంతులు ఆడి నెమ్మెదిగా 50 పరుగులు సాధించిన ప్లేయర్‌గా చెత్త రికార్డు అందుకున్నాడు అ మీర్. వేగవంతంగా చేయాల్సిన టీ20 పరుగులను ఆలస్యంగా చేసిన ప్లేయర్ల వివరాలిలా :
ఎదుర్కొన్న బంతులు - ఆడిన వేదికలు
52 - మొహమ్మద్ రిజ్వాన్, న్యూయార్క్ వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో, 2024