తెలంగాణ

telangana

ETV Bharat / sports

నీరజ్‌ చోప్రా ఎక్స్​ రే పోస్ట్- బల్లెం వీరుడి గాయంపై మను రియాక్షన్ వైరల్ - Neeraj Chopra Manu Bhaker

Neeraj Chopra Manu Bhaker : ​భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్​ ఫైనల్​లో చేతి గాయంతో బరిలో దిగినట్లు ఓ పోస్ట్ షేర్ చేశాడు. దీనిపై షూటర్ మను బాకర్ రియాక్షన్ వైరల్​గా మారింది.

Neeraj Chopra Manu Bhaker
Neeraj Chopra Manu Bhaker (Source: Associated Press (Left), Getty Images (Right))

By ETV Bharat Sports Team

Published : Sep 16, 2024, 9:03 AM IST

Updated : Sep 16, 2024, 9:10 AM IST

Neeraj Chopra Manu Bhaker :భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2024 డైమండ్ లీగ్​లో 1 సెంటీమీటర్​ తేడాతో తొలి స్థానం కోల్పోయాడు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ పోటీలో నీరజ్ బల్లెంను 87.86 మీటర్లు విసిరి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఈ పోటీలో పీటర్స్‌ అండర్సన్‌ (గ్రెనెడా) ఈటను 87.87 మీటర్ల దూరం విసిరి ఛాంపియన్​గా నిలిచాడు.

అయితే ఈ ఫైనల్​కు తాను చేతి గాయంతోనే బరిలోకి దిగినట్లు పోటీ అనంతరం నీరజ్ సోషల్ మీడియా ద్వారా చెప్పాడు. ఈ మేరకు చేతి ఎక్స్​ రే ఫొటోను షేర్ చేశాడు. కాగా, ఈ పోస్ట్​ను ఒలింపిక్ మెడల్ విన్నర్, స్టార్ షూటర్ మను బాకర్ తన అకౌంట్​లో షేర్ చేసింది. నీరజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. 'ఛాంపియన్​ నీరజ్ 2024 సీజన్​లో సాధించిన దానికి నీకు అభినందనలు. ఈ గాయం నుంచి త్వరగా కోలుకొని రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలంని ఆకాంక్షిస్తున్నా' అని మను ట్విట్టర్​లో రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'ఓ ఛాంపియన్, ఇంకో ఛాంపియన్​ను ప్రశంసిస్తుంది', 'నీరజ్ నువ్వు నిజమైన హీరో', 'ఇది చిన్న గాయమే త్వరగానే నువ్వు కోలుకుంటావు' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, పారిస్ ఒలింపిక్స్​ సందర్భంగా నీరజ్, మను బాకర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మను అమ్మ, నీరజ్​తో సన్నిహితంగా మాట్లాడిన వీడియో ఒకటి వైరలైంది. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది. వీరిద్దరూ లవ్​లో ఉన్నారంటూ ప్రచారం సాగింది. కానీ, ఈ వార్తలను అటు మను బాకర్ ఫ్యామిలీ, ఇటు నీరజ్ కొట్టి పారేశారు. వాళ్లిద్దరి అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు.

Paris Olympics :పారిస్ వేదికగా ఇటీవల ముగిసిన విశ్వక్రీడల్లో మను వ్యక్తిగత, మిక్స్​డ్ టీమ్ షూటింగ్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు నీరజ్ చోప్రా పరుషుల జావెలిన్ త్రో లో రజతం దక్కించుకున్నాడు.

'వేలు విరిగినా బరిలోకి దిగాను'- డైమండ్​ లీగ్ ఫైనల్​పై నీరజ్ - Neeraj Chopra Diamond League

మను బాకర్​, నీరజ్ స్పెషల్ చిట్​చాట్- వీడియో వైరల్- మేటర్ ఏంటంటే? - Paris Olympics 2024

Last Updated : Sep 16, 2024, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details