Imane Khelif Filed Complaint:ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ తనపై వచ్చిన విమర్శలకు ఘూటుగా స్పందించింది. సోషల్ మీడియాలో ఆమెను వేధించారంటూ ఇమానె చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఫ్రాన్స్‌లో ఫిర్యాదు చేసినట్లు ఇమానె లాయర్ పేర్కొన్నారు. 'సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, విమర్శల పట్ల పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు దాఖలు చేశాము. ఖలీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆమెను వేధింపులకు గురి చేశారు' అని ఇమానె న్యాయవాది నబిల్ బౌడి తెలిపారు.
అయితే పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్లో ఇమానె ఇజ్రాయెల్ బాక్సర్‌పై కేవలం 46 సెకన్లలోనే బౌట్ నెగ్గింది. దీంతో ఇమానెకు పురుష లక్షణాలున్నాయంటూ సోషల్ మీడియాలో పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పురుష లక్షణాలున్నవారిని మహిళల బాక్సింగ్‌లో ఎలా అనుమతించారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఆమెను పోటీల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై స్పందిచిన ఒలింపిక్ సంఘం నిబంధనల మేరకే ఇమానె పోటీల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది.
అందులో నో ఎంట్రీ
కాగా, 25 ఏళ్ల ఇమానె ఖెలిఫ్ అల్జీరియాలోని తియారెట్ ప్రాంతానికి చెందిన బాక్సర్. ప్రపంచస్థాయి క్రీడల్లో బంగారు పతకం నెగ్గి, భావి తరాలకు స్ఫూర్తిగా నిలవాలన్నది ఖెలిఫ్ ఆకాంక్ష. టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లో ఓడిన ఇమానె ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగింది. కానీ, 2023 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమెకు 'లింగం' సమస్య తలెత్తింది. ఆమెలో ఎక్స్, వై క్రోమోజోములు ఉన్నాయంటూ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోషియేషన్ ఆమెను పక్కనపెట్టింది. అయితే భిన్న నిబంధనలు కలిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మాత్రం ఖెలిఫ్‌కు ఈ విశ్వ క్రీడల్లో పోటీపడే అవకాశం కల్పించింది.