Novak Djokovic Poisoned : టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ సంచలన ఆరోపణ చేశాడు. తనపై విషప్రయోగం జరిగినట్లు తెలిపాడు. 2022లో మెల్బోర్న్లోని ఓ హోటల్లో తనకు విషపూరిత ఆహారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. సీసం, పాదరసం కలిసి ఉన్న ఆహారాన్ని ఇచ్చి తనను ఇబ్బందిపెట్టినట్లు వెల్లడించాడు.
కాగా, కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోని కారణంగా 2002లో ఆస్ట్రేలియా నుంచి జకోవిచ్‌ను డిపోర్ట్ చేశారు. అలాగే అతడి వీసాను రద్దు చేసి అతన్ని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా వెనక్కి పంపించేశారు. అయితే ఆ ఏడాది జరిగిన ఘటన గురించి తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు.
"ఆస్ట్రేలియాలో క్వారంటైన్ సమయంలో నాకు విషపూరిత ఆహారం ఇచ్చారు. దీంతో శరీరంలో మెర్కురీ, లెడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నాను. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. సెర్బియాకు తిరిగి వెళ్లిన తర్వాత కొన్ని విషయాలు గుర్తించాను. కానీ ఆ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పలేదు. ఎందుకంటే నా శరీరంలో అధిక స్థాయిలో మినిరల్స్ ఉన్నట్లు గుర్తించాను. కొన్ని రోజులు ఫ్లూతో బాధపడ్డాను. ఇంట్లోనే ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది." అని జకోవిచ్ తెలిపాడు.