Nitish Kumar Reddy Injury :ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో నెగ్గి, జోరుమీదున్న టీమ్ఇండియాకు షాక్ తగిలింది. యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా మిగిలిన సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. రెండో టీ20 నేపథ్యంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా నితీశ్ గాయపడినట్లు తెలిసింది. గాయం తీవ్రత పెద్దది కావడం వల్ల మేజేజ్మెంట్ రిస్క్ తీసుకోకుండా అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, తొలి మ్యాచ్ తది జట్టులో నితీశ్ స్థానం దక్కించుకున్నప్పటికీ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ బరిలోకి దిగలేదు. మరోవైపు సిక్సర్ కింగ్ రింకూ సింగ్ సైతం గాయం బారిన పడ్డాడు. తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా రింకూ వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో రింకూ రెండు, ముూడో టీ20 మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.
సన్‌రైజర్స్ రియాక్షన్
నితీశ్ గాయంపై సన్‌రైజర్స్ యాజమాన్యం స్పందించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆశించింది. ఈ మేరకు అఫీషియల్ అకౌంట్నుంచి ఓ ట్వీట్ చేసింది. 'నితీశ్, నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. మరింత బలంగా తిరిగి రా' అని రాసుకొచ్చింది.
రిప్లేస్మెంట్
గాయం కారణంగా జట్టుకు దూరమైన ఈ ఇద్దరి స్థానాల్లో శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్ వచ్చారు. ఇక ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.