తెలంగాణ

telangana

ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన నైజీరియా- న్యూజిలాండ్​పై సంచలన విజయం - NIGERIA VS NEW ZEALAND 2025

క్రికెట్​లో సంచలనం- కివీస్​పై నైజీరియా విజయం

Nigeria Vs New Zealand
Nigeria Vs New Zealand (Source : ICC X Handle)

By ETV Bharat Sports Team

Published : Jan 20, 2025, 3:46 PM IST

Nigeria Vs New Zealand 2025 :క్రికెట్​లో హిస్టరీలో సంచలన విజయం నమోదైంది. వరల్డ్​ క్రికెట్​లో అత్యంత పటిష్ఠమైన న్యూజిలాండ్​ జట్టును పసికూన నైజీరియా ఓడించింది. 2025 మహిళల అండర్‌-19 వరల్డ్​కప్​లో భాగంగా తాజాగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో నైజీరియా అమ్మాయిల జట్టు 2 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గి చరిత్ర సృష్టించింది. దీంతో నైజీరియా అమ్మాయిల ఆనందానికి అవుధుల్లేకుండా పోయాయి. సంతోషంతో కేరింతలు కొడుతూ మైదానం అంతటా తిరిగి సంబరాలు చేసుకున్నారు.

మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం న్యూజిలాండ్- నైజీరియా జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్​కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. దీంతో 20 ఓవర్లు సాగాల్సిన ఆటను నిర్వాహకులు ఇరువైపులా 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా మహిళల జట్టు 13 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది.

అనంతరం స్వల్ప లక్ష్య చేధనకు దిగిన న్యూజిలాండ్ 13ఓవర్లు ఆడి 63-6 స్కోర్​కే పరిమితమైంది. అయితే చివరి 6 బంతుల్లో కివీస్​ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో లిలియన్ ఉదేహా బంతి అందుకుంది. ఆఖరి ఓవర్​ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టుకు చరిత్రాత్మక విజయం అందించింది. కాగా, అండర్- 19 టీ20 వరల్డ్​కప్​ హిస్టరీలో నైజీరియా జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details