Neeraj Chopra Net Worth:దేశవ్యాప్తంగా నీరజ్ చోప్రా పేరు మార్మోగిపోతోంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన ఈ గోల్డెన్ బాయ్ చరిత్ర సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతం అందించి నీరజ్ చరిత్ర పుటల్లో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అయితే ఈ గోల్డెన్ బాయ్ ఆస్తులు ఎంతుంటాయ్? ఏడాదికి ఎన్ని కోట్లు సంపాదిస్తడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. .
అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తర్వాత బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా దేశంలో అత్యధికంగా సంపాదించే రెండో అథ్లెట్ నీరజ్ చోప్రానే కావడం విశేషం. నీరజ్ గ్యారేజ్ నిండా లగ్జరీ కార్లు, ఖరీదైన బైక్‌లు ఉంటాయి. విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది.
ఆస్తులు రూ. 37 కోట్లపైనే
నీరజ్ లైఫ్ స్టైల్ విలాసవంతంగా ఉంటుంది. ఈ స్టార్ అథ్లెట్ ఆస్తుల విలువ 2024 నాటికి రూ. 37 కోట్లకుపైనే అని ఒక అంచనా. ఆయా టోర్నమెంట్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా నీరజ్ ఏడాదికి భారీగానే ఆర్జిస్తున్నాడు. నీరజ్ చోప్రా హరియాణా ప్రభుత్వంలో గ్రూప్- 1 ఉద్యోగి కూడా. జీతం, టోర్నమెంట్ మ్యాచ్ ఫీజు కలిపితేనే నీరజ్‌కు ఏటా దాదాపు రూ.4 కోట్లపైనే ఆదాయం వస్తుంది. ఈ మొత్తం అతని నికర ఆస్తుల్లో కేవలం 10 శాతం మాత్రమే. నీరజ్ కు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఏడాది పొడవునా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది.