Hardik Pandya Natasa Stankovic Divorce:హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిచ్ విడాకుల న్యూస్‌లో సరికొత్త ట్విస్ట్ ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం హార్దిక్ పాండ్య భార్య నటాసా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వారి పెళ్లి ఫోటోలను తీసేసింది. అప్పటి నుంచే మీడియాలో వీరి ఇద్దరి డివోర్స్‌పై రకరకాల కథనాలు వినిపించాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ నటాషా మళ్లీ తన ఇన్స్టాగ్రామ్ లో తమ పెళ్లి ఫోటోలను రిస్టోర్ చేసింది.
2020 మే లోనే హార్దిక్‌కు సెర్బియకు చెందిన నటి, మోడల్ నటాషాకు పెళ్లి అయ్యింది. కానీ 2023 ఫిబ్రవరిలో ఉదయపుర్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్‌గా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, అందుకే విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఇక మరోవైపు నటాషా కూడా తన ఇన్స్‌స్టాగ్రామ్ నుంచి హార్దిక్ పాండ్యతో పెళ్లి ఫోటోలను తొలగించం ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. దీంతో వీళ్లు విడిపోతున్నారని చాలా మంది నమ్మారు.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఏర్పడింది. ఆమె మళ్లీ ఆ ఫోటోలను తిరిగి పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ కన్ఫ్యూజన్కు గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుందని చర్చించుకుంటున్నారు. ఇక నటాషా ఫొటోలను రీ అప్లోడ్ చేయడం వల్ల వారిద్దరూ మళ్లీ కలిసిపోయినట్లై అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సిన హార్దిక్ పాండ్య ఇప్పటివరకు ఈ వార్తలకు స్పందించలేదు.