తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాలీవుడ్ రేంజ్​లో ధోనీ కొత్త లుక్ - ఏముంది రా బాబు ఆ హెయిర్ స్టైల్! - MS DHONI NEW LOOK

ధోనీ న్యూ లుక్​ వైరల్ - నెట్టింట తల ఫోటోలకు సూపర్​ క్రేజ్​

Ms Dhoni New Look
Ms Dhoni (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 12, 2024, 1:53 PM IST

Ms Dhoni New Look :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ధోనీ తాజాగా న్యూ స్టైల్​లో నెట్టింట తెగ సందడి చేస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్​ నుంచి ఇప్పటివరకూ పొడుగు జట్టుతో కనిపించిన ఆయన తాజాగా కొత్త లుక్​లోకి మారిపోయాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రముఖ హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్ హ‌కిమ్ తాజాగా సోషల్ మీడియాలో అప్​లోడ్ చేయగా, దానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఇవి చూసిన అభిమానులు ఆయనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'హాలీవుడ్‌ హీరోలా ఉన్నావ్‌', 'తల నీ లుక్ అదిరిపోయింది', 'ఓల్డ్​ లుక్​ను మిస్ అవుతున్నాం' అని అంటున్నారు.

ఇక ధోనీ క్రికెట్ కెరీర్​ విషయానికి వస్తే, 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో టీమ్ఇండియా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడి, ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ పలికాడు.దీంతోగత కొంతకాలంగా ఆయన ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఓ కెప్టెన్​గా, అలాగే కీలక ప్లేయర్​గా జట్టును ముందుకు నడిపించిన మిస్టర్ కూల్​, ఆ టీమ్​ను ఏకంగాఐదు సార్లు ఛాంపియన్​గా నిలిపాడు.

అయితే ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అనేది ప్రస్తుతం అనేక మంది మదిలో మెదిలే ప్రశ్న. కానీ వచ్చే సీజన్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. అయితే ధోనీ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో ఐపీఎల్ కొత్త నిబంధనల ప్రకారం, ఎంఎస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అన్​క్యాప్​డ్​ ప్లేయర్​గా రిటైన్ చేసుకోవచ్చని తెలుస్తోంది. దీని వల్ల 18వ సీజ‌న్‌లో అత‌డి ఆదాయంలో రూ. 8 కోట్లు కోత ప‌డ‌నున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్​ నయా రూల్ ప్రకారం అన్‌క్యాప్ట్ ప్లేయ‌ర్ ఎవ‌రైనా స‌రే వాళ్ల‌కు రూ. 4 కోట్లు మాత్ర‌మే ఇవ్వాల‌ని ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స్ప‌ష్టం చేసింది. ఈ ప్రకారం ధోనీ ఐపీఎల్​ కెరీర్​ విషయంలో రానున్న సీజన్​లో ఏమేరకు ఎఫెక్ట్ చూపిస్తుందో అని అభిమానులు అంటున్నారు.

రోహిత్​కు అది దేవుడిచ్చిన ఓ గొప్ప బహుమతి : ధోనీ

ధోనీ + రిపోర్టర్స్​ = 'హిలేరియస్ కాంబినేషన్'​ - ప్రెస్ మీట్​లో మిస్టర్ కూల్​ ఇచ్చిన ఫన్నీ​ ఆన్సర్స్ ఇవే! - Dhoni Funny Moments With Reporters

ABOUT THE AUTHOR

...view details