తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్యాబ్‌ 5లో ఎక్కువ సార్లు డకౌట్‌ అయిన ప్లేయర్ ఎవరో తెలుసా? - Most Ducks In International Cricket

Most Ducks In International Cricket : వరల్డ్‌ క్రికెట్‌లో జో రూట్‌, కేన్ విలియమ్సన్‌, విరాట్ కోహ్లీ, బాబర్‌ అజామ్​, స్టీవ్​ స్మిత్‌ను ఫ్యాబ్‌ 5గా పేర్కొంటారు. వీరిలో ఎక్కువ సార్లు డకౌట్‌ అయిన చెత్త రికార్డు విరాట్‌ పేరిట ఉంది. దీనికి కారణాలు ఏంటంటే?

Most Ducks In International Cricket
Most Ducks In International Cricket (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Aug 24, 2024, 8:54 PM IST

Most Ducks In International Cricket : క్రికెట్‌లో గణాంకాలు చాలా కీలకం. ఒక ప్లేయర్‌ కెరీర్‌ను అతడు సాధించిన సెంచరీలు, పరుగులు, రికార్డులే నిర్వచిస్తాయి. అద్భుతమైన ప్రదర్శనలే కాదు, చెత్త ప్రదర్శనలు కూడా గణాంకాల్లో చేరుతాయి. ఓ బ్యాటర్‌ ఎన్ని ఎక్కువసార్లు డకౌట్‌ అయితే, అంత చెత్త రికార్డు సొంతం చేసుకుంటాడు. అయితే ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేర్కొంటున్న విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్, బాబర్ అజామ్‌లో ఎక్కువ సార్లు డకౌట్‌ అయింది ఎవరో తెలుసా? టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ. ఆశ్చర్యంగ ఉందా? ఈ చెత్త రికార్డు వివరాలు ఇప్పుడు చూద్దాం.

విరాట్ కోహ్లీ డక్ రికార్డ్
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా విరాట్‌ కోహ్లీ గుర్తింపు పొందాడు. పరుగుల వరద పారించి ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులు అందుకున్నాడు. అలానే అంతర్జాతీయ క్రికెట్‌లో 37 సార్లు డకౌట్‌ అయ్యాడు. మొదటి సారి అతడు 2010లో డకౌట్‌ అయ్యాడు.

జో రూట్
ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ ఖాతాలో 23 డకౌట్‌లు ఉన్నాయి. స్మూత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌తో పాపులర్‌ అయిన జో రూట్‌ కూడా అప్పుడప్పుడు పరుగుల ఖాతా ఓపెన్‌ చేయకుండానే వెనుదిరిగాడు.

కేన్ విలియమ్సన్
విలియమ్సన్ బ్యాటింగ్‌ ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. నెమ్మదిగా, ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ని నిర్మిస్తాడు. అయినా కెరీర్‌లో డకౌట్‌లను నియంత్రించలేకపోయాడు. న్యూజిలాండ్‌ కీలక ఆటగాడు ఏకంగా 20 సార్లు డకౌట్‌ అయ్యాడు.

స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా కీలక ఆటగాడు స్టీవ్‌ స్మిత్ 19 సార్లు డకౌట్ అయ్యాడు. ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలితో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన స్మిత్‌, అప్పుడప్పుడూ ఒక్క పరుగు కూడా చేయలేక పెవిలియన్‌ చేరాడు

బాబర్ అజామ్‌
ఈ లిస్టులో అతి చిన్న వయస్కుడు జాబర్‌ అజామ్‌ కూడా 18 సార్లు డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. పాక్‌ టీమ్‌లో అతడిపై ఉన్న భారీ అంచనాలు ఉన్నప్పటికీ కెరీర్‌లో డకౌట్‌లు తప్పలేదు.

డక్ లిస్ట్‌లో కోహ్లీ టాప్‌లో ఎందుకున్నాడు?

అత్యధిక ఇన్నింగ్స్‌లు
కోహ్లీ మిగతా వాళ్ల కంటే చాలా ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఇలా డకౌట్ అయ్యే అవకాశాలు పెరిగాయి. అతడి అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ ఎక్కువగా ప్రయోజనాలు తీసుకొచ్చింది. అప్పుడప్పుడు డకౌట్‌గా వెనుదిరిగే రిస్కు కూడా ఉంటుంది.

అన్ని ఫార్మాట్‌లలో కీలక ప్లేయర్‌
చాలా కాలం పాటు మూడు ఫార్మాట్‌లలో కోహ్లీ కీలక ఆటగాడిగా కొనసాగాడు. ఎక్కువ కాలం, మూడు ఫార్మాట్‌లలో ఆడటం వల్ల కూడా విరాట్‌ డకౌట్‌ల సంఖ్య పెరిగి ఉండొచ్చు. ప్రతి బంతిని పర్ఫెక్ట్‌ ఆడాలనే ప్రయత్నాలు కూడా బోల్తా కొట్టవచ్చు. ఫలితంగా పరుగులు చేయకుండానే వెనుదిరగాల్సి వస్తుంది.

కెప్టెన్సీ ఒత్తిడి
ఇండియాకి నాయకత్వం వహించడం అదనపు ఒత్తిడిని జోడిస్తుంది. ఈ కారణంగా కూడా విరాట్‌ డకౌట్‌ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా కీలకమైన మ్యాచుల్లో ఎక్కువసర్లు సున్నా పరుగులకు అవుట్‌ అయ్యాడు.

MRFతో కోహ్లీ రికార్డ్​ బ్యాట్ స్పాన్సర్‌షిప్ డీల్​ - విరాట్​కు ఆ కంపెనీ ఎంత చెల్లిస్తుందంటే? - Kohli MRF Sponsorship

'విరాట్​ది పరుగుల ఆకలి'- కోహ్లీపై హిట్​మ్యాన్ ప్రశంసలు - Rohit Sharma On Virat Kohli

ABOUT THE AUTHOR

...view details