Mohammed Siraj RCB :ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరిగింది. ఇందులో విజయాన్ని నమోదు చేసుకున్న ఆర్సీబీ 10 పాయింట్లతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటివరకూ 12 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు చివరి నాలుగు మ్యాచ్‌లలోనూ విజయాన్నే నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ షమీ చేసిన ఓ పని ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
పవర్ ప్లేలో సిరాజ్ పంజాబ్ జట్టును చక్కగా కట్టడి చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు వికెట్లు పడగొట్టి బెంగళూరుకు విజయాన్ని అందించాడు. ఇక పంజాబ్ కింగ్స్ చివరి బ్యాటర్ అర్ష్‌దీప్ సింగ్‌ను 17వ ఓవర్లో ఔట్ చేసి, "ఇక్కడ నేనున్నాను. మీరు టెన్షన్ పడకండి" అనే అర్థం వచ్చేలా సైగ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. సిరాజ్ ఆ చివరి వికెట్ తీయడం వల్ల ఆర్సీబీ 60 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది.
ఐపీఎల్లో తన సత్తా చాటి టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు సిరాజ్. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై అద్భుతంగా ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత పేసర్‌గా రికార్డుకెక్కాడు. ఆ మ్యాచ్‌లో సిరాజ్ దెబ్బకు లంక 50 రన్స్‌కే పరిమితమైంది. ఆ తర్వాత సౌతాఫ్రికాపై కేప్ టౌన్ టెస్టులోనూ సిరాజ్ చెలరేగిపోయాడు. 15 పరుగులకే 6 వికెట్లతో ప్రత్యర్థులను కట్టడి చేశాడు.