Manu Bhaker Paris Olympics 2024:పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ షూటర్ మను బాకర్‌కు త్రుటిలో మూడో పతకం మిస్ అయ్యింది. శనివారం జరిగిన 25మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మను 28పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇక ఇదే ఈవెంట్లో యాంగ్ జిన్ (కొరియా) తొలి స్థానంలో నిలిచి పసిడి ముద్దాడగా, రెండో ప్లేస్‌లో ఉన్న కమెలీ (ఫ్రాన్స్) సిల్వర్ మెడల్ దక్కించుకుంది. కాగా, మూడో స్థానంలో నిలిచిన వెరోనికా (హంగేరీ)కు కాంస్యం దక్కింది.
ఫైనల్ పోటీని మను కాస్త నెమ్మదిగా ప్రారంభించింది. తొలి సిరీస్ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకుంది. ఒక దశలో మను రెండో స్థానానికి ఎగబాకింది. అయితే ప్రత్యర్థి షూటర్లు కూడా అత్యుత్తమంగా ఆడడం వల్ల మనుకు తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో మను మూడో స్థానాన్నైనా దక్కించుకుంటుందని అనుకున్నారంతా. ఈ క్రమంలో హంగేరి అథ్లెట్ 3 షాట్లతో మూడో స్థానానికి దూసుకెళ్లింది. మను నాలుగో ప్లేస్‌కు పడిపోయింది. దీంతో మమ షూటర్ పోరాటం ముగిసింది. కాగా, ప్రస్తుత ఒలింపిక్స్‌లో మను ఇప్పటికే 2 కాంస్య పతకాలు సాధించింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్‌లో తొలి కాంస్యం ముద్దాడగా, 10మీటర్ల రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్‌జోత్‌తో కలిసి రెండో కాంస్యం దక్కించుకుంది. తాజా ఈవెంట్లో నాలుగో స్థానంతో పారిస్ ఒలింపిక్స్‌ను మను బాకర్ ఘనంగానే ముగించింది.
పోటీ ముగిసిన తర్వాత మను మాట్లాడింది. 'రెండు కాంస్య పతతాలు నెగ్గడం సంతోషంగా ఉంది. కానీ, చివరి ఈవెంట్లో నాలుగో స్థానానికి పరిమితమైనందుకు చింతిస్తున్నా' అని పేర్కొంది.