LSG vs DC IPL 2024 :2024 ఐపీఎల్లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎట్టకేలకు వరుస ఓటముల నుంచి బయటపడింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ మొదట్లో కాస్త తడబడింది. డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (8 పరుగులు) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. వార్నర్‌ను యశ్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత కాసేపటికి మరో ఓపెనర్ పృథ్వీ షా (32 పరుగులు) కూడా పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన జేక్ ఫ్రాజర్, రిషబ్ పంత్ మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ (35 బంతుల్లో 2×4, 5×6 సాయంతో 55;), పంత్ (24 బంతుల్లో 4×4, 2×6 సాయంతో 41) చెలరేగడంతో దిల్లీ 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ (2/25) మెరిశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (22 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 39), ఆర్షద్ ఖాన్ (20* పరుగులు) రాణించారు. క్వింటన్ డికాక్ (19 పరుగులు), పడిక్కల్ (3 పరుగులు), మార్కస్ స్టోనియిస్ (8 పరుగులు), నికోలస్ పూరన్ (0), దీపక్ హుడా (10 పరుగులు), కృనాల్ పాండ్య (3 పరుగులు) విఫలమయ్యారు. ఇలా దిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ (3/20) స్పిన్ వలలో చిక్కుకున్న లఖ్‌నవూను ఆఖర్లో ఆయుశ్ బదోనీ (55* పరుగులు, 35 బంతుల్లో) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇతడితో పాటు అర్షద్ కూడా రాణించడం వల్ల లఖ్‌నవూ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఇంకా ఖలీల్ అహ్మద్ 2, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
ఆ రెండూ నా టార్గెట్!- అప్పటిదాకా నో రిటైర్మెంట్!- రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Rohit Sharma Retirement
ధోనీ కోసం స్టేడియానికి- రూ.64వేలు పెట్టి బ్లాక్‌లో టికెట్ కొనుగోలు- కూతురి ఫీజు కట్టకుండా! - Dhoni Fan Ipl Ticket