తెలంగాణ

telangana

ETV Bharat / sports

లఖ్​నవూపై దిల్లీ విజయం - ఈ రెండు జట్ల ప్లే ఆఫ్స్​ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? - IPL 2024

LSG vs DC IPL 2024: 2024 ఐపీఎల్​లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ను ఓడించించి దిల్లీ క్యాపిటల్స్. తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఈ రిజల్ట్​తో ఈ రెండు జట్ల ప్లే ఆఫ్స్​ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

IPL 2024
IPL 2024 (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 10:59 PM IST

Updated : May 15, 2024, 6:22 AM IST

LSG vs DC IPL 2024 :2024 ఐపీఎల్​లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ను ఓడించించి దిల్లీ క్యాపిటల్స్. తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఏడో విజయాన్ని అందుకున్న పంత్ సేన, సాంకేతికంగా ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్నప్పటికీ పేలవ రన్‌రేట్​ కారణంగా ముందడగు వేయడం కష్టమే. లేదంటే మిగతా మ్యాచ్‌ల్లో అద్భుతాలే జరగాలి. ఇక ఏడో ఓటమిని అందుకున్న లఖ్‌నవూ పరిస్థితీ ఇదే. మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్న ఆ జట్టు, అందులో గెలిచినా ఎటువంటి ఉపయోగం దాదాపుగా ఉండకపోవచ్చు.

మ్యాచ్ సాగిందిలా - అభిషేక్‌ పోరెల్‌ (33 బంతుల్లో 5×4, 4×6 సాయంతో 58;), స్టబ్స్‌ (25 బంతుల్లో 3×4, 4×6 సాయంతో 57 నాటౌట్‌;) చెలరేగడం వల్ల మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్‌ (1/26) మెరుగైన బౌలింగ్‌ చేశాడు. 209 పరుగుల లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ 9 వికెట్లకు 189 పరుగులే చేసింది. చేయగలిగింది. ఇషాంత్‌ (3/34) ఆ జట్టును గటత్టిగానే దెబ్బతీశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (5) తొలి ఓవర్ ఐదో బంతికే పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించి క్యాచౌట్​ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా క్వింటన్ డికాక్ (12 పరుగులు), మార్కస్ స్టోయినిస్ (5 పరుగులు), దీపక్ (0) పెవిలియన్​ క్యూ కట్టారు. దీంతో పవర్​ ప్లే ముగిసేసరికే లఖ్​నవూ 4 వికెట్లు కోల్పోయింది. పూరన్‌ (27 బంతుల్లో 6×4, 4×6 పరుగుల సాయంతో 61;), అర్షద్‌ ఖాన్‌ (58 నాటౌట్‌; 33 బంతుల్లో 3×4, 5×6) రాణించినా ఫలితం లేకపోయింది.

పూరన్ ఒక్కడై: టపటపా వికెట్లు పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన పూరన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మెరుపు వేగంతో పరుగులు సాధించాడు. కేవలం 27 బంతుల్లోనే 61 పరుగులు బాదాడు. అందులో 6 ఫోర్లు, 4 సిక్స్​లు ఉన్నాయి. దీంతో లఖ్​నవూ పోటీలోకి వచ్చింది. కానీ, 11.1 వద్ద ముకేశ్ కుమార్, పూరన్​ను ఔట్ చేసి దిల్లీకి బ్రేక్ ఇచ్చాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్​లో ఓపెనర్ మెక్ గుర్క్​ ఫ్రేజర్ (0) డకౌటయ్యాడు. ఇన్నింగ్స్​ రెండో బంతికే అర్షద్ ఖాన్ బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ యంగ్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (58 పరుగులు, 33 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అతడు వన్​డౌన్​లో వచ్చిన షై హోప్​ (38 పరుగులు)తో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు పెవిలియన్​ చేరారు.

ఇక కెప్టెన్ రిషభ్ పంత్ (33 పరుగులు) ఆకట్టుకున్నాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (57* పరుగులు, 25 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 228.00 స్ట్రైక్​ రేట్​తో 3 ఫోర్లు, 4 సిక్స్​లతో విరుచుకుపడ్డాడు. దీంతో దిల్లీ స్కోర్ 200 దాటింది. ఇక లఖ్​నవూ బౌలర్లలో నవీన్​ ఉల్ హక్ 2, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

హెడ్​కోచ్ రేస్​లో లక్ష్మణ్, లాంగర్?- ఉండాల్సిన ఆ అర్హతలివే! - Team India New Head Coach

కేఎల్ రాహుల్ - సంజీవ్ గోయెంకా గొడవపై స్పందించిన కోచ్​ - ఏమన్నారంటే? - IPL 2024

Last Updated : May 15, 2024, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details