తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఛాంపియన్స్‌ ట్రోఫీ - ఆ నిర్ణయం తీసుకుంటే పీసీబీ సంగతి అంతే!

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై వీడని ఉత్కంఠ - ఆతిథ్య హక్కులు కోల్పోతే పాక్​కు భారీ నష్టం!

CHAMPIONS TROPHY 2025
CHAMPIONS TROPHY 2025 (source Getty Images)

By ETV Bharat Sports Team

Published : 10 hours ago

CHAMPIONS TROPHY 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్‌ వేదికగా జరిగబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సస్పెన్స్ వీడటం లేదు. పాకిస్థాన్​కు టీమ్ ఇండియా వెళ్లేదే లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు, పీసీబీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ అధికారికంగా తెలియజేయకపోవడం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

తీవ్ర పరిణామాలు తప్పవు!
మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఐసీసీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో పాక్‌ తన మొండి వైఖరిని అలాగే కొనసాగించి, ఛాంపియన్స్‌ ట్రోఫీని బహిష్కరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు పాకిస్థాన్ క్రికెట్ బోర్డును హెచ్చరిస్తున్నారు.

'ఆ నిర్ణయం అంత సులువు కాదు'
ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరంగా ఉండాలని పాక్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదని ఐసీసీ ఈవెంట్లపై అవగాహన ఉన్న ఓ సీనియర్‌ క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌ తెలిపాడు. ఈ ట్రోఫీ నుంచి వైదొలగాలని పీసీబీ నిర్ణయించుకుంటే, తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించాడు. రెవెన్యూ పరంగా భారీ నష్టాలు, చట్టపరమైన చ1ర్యలు, క్రికెట్‌ ప్రపంచంలో ఒంటరయ్యే ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించాడు.

'ఐసీసీతో పాక్ ఒప్పందం'
"పాకిస్థాన్‌ కేవలం ఐసీసీతో ఆతిథ్య ఒప్పందంపై సంతకం చేయడమే కాకుండా, ఇతర సభ్యదేశాల మాదిరిగానే మ్యాండేటరీ పార్టిసిపేషన్‌ అగ్రిమెంట్​కు (ఎంపీఏ) అంగీకరించింది. ఎంపీఏపై సంతకం చేస్తే, ఐసీసీ ఈవెంట్ల ద్వారా ఆర్జించే ఆదాయంలో కొంత భాగాన్ని సభ్య దేశం పొందుతుంది. బ్రాడ్‌కాస్టింగ్‌ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే.. చాంపియన్స్‌ ట్రోఫీ సహా అన్ని ఈవెంట్లకు సభ్యదేశాలు అందుబాటులో ఉంటాయని ఐసీసీ వారికి హామీ ఇస్తుంది" అని సీనియర్‌ క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌ తెలిపాడు.

ఆయన స్పందించాల్సిందే?
పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మొత్తం సమస్యపై స్పష్టత ఇవ్వాలని క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌ వ్యాఖ్యానించాడు. ఎంపీఏలు అన్ని దేశాలకు ఒకే విధంగా ఉంటాయని, ఐసీసీతో చేసుకున్న ఆతిథ్య ఒప్పందాన్నిృ ఉల్లంఘిస్తే పీసీబీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని హెచ్చరించాడు.

కాగా, వచ్చే ఏడాది పాకిస్థాన్‌ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చి హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్థాన్‌ కూడా హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరిస్తుందనే అంతా అనుకుంటున్నారు. అయితే, భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లలో తమ మ్యాచ్‌లకూ ఇదే మోడల్‌ను అనుసరించాలని ఇప్పటికే పాక్‌ బోర్డు ఐసీసీ దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఆ భయం మమ్మల్ని వెంటాడుతోంది - ఇక ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే : పాక్ మాజీ కెప్టెన్

ఒకే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన అన్నదమ్ములు- కానీ ఓ ట్విస్ట్​!

ABOUT THE AUTHOR

...view details