KL Rahul Sanjiv Goenka : వచ్చే ఐపీఎల్ సీజన్(2025)కు ముందు మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా ఆక్షన్‌తో జట్ల రూపురేఖలు, బలబలాలు మారడం ఖాయం అనిపిస్తోంది. ఇప్పటికే వేలంలో స్టార్ ప్లేయర్స్‌ను కొనుగోలు చేసి తమ జట్లను మరింత పటిష్టంగా చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు ప్రణాళికలను రచిస్తున్నాయి. సపోర్టింగ్ స్టాఫ్‌పైనా కూడా దృష్టి సారించాయి. అయితే జట్లు ఎంతమంది ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకోవచ్చనే విషయంపై బీసీసీఐ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆ పనిపైనే ఉందట.
మరోవైపు కొద్ది రోజులుగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ సారథిగా ఉన్న కేఎల్ రాహుల్ ఆ ఫ్రాంఛైజీని వదిలి మరో జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశముందని జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే అతడు తాజాగా ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకాను కలవడంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
KL Rahul Lucknow Super Giants :అయితే ఇప్పుడు తాజాగా అందిన మరో సమాచారం ప్రకారం కేఎల్ రాహుల్‌ను గోయెంకాను కలిసినప్పటికీ లఖ్‌నవూ రాహుల్‌ను రిటైన్ చేసుకునే ఛాన్స్ లేదని తెలిసింది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి.