Kane WilliamsonIND VS NZ Test Series : పుణె వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 24 నుంచి రెండో టెస్టు పోరు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో కివీస్‌కు గట్టి షాక్ తగిలింది. రెండో టెస్టు మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది.
రెండో టెస్టుకూ దూరం! - కేన్ విలియమ్సన్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే? - KANE WILLIAMSON IND VS NZ TEST
రెండో టెస్ట్ సిరీస్‌కు ప్రాక్టీస్ స్టార్ట్ - గాయం వల్ల కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కూ దూరం!
Published : Oct 22, 2024, 11:09 AM IST
శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయంలో గజ్జల్లో గాయమై విలవిల్లాడిన కేన్, దాని నుంచి కోలుకుంటాడని భావించి భారత్ సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే జట్టుతో కలిసి అతడు భారత్‌కు రాలేకపోయాడు. స్వదేశంలో ఉంటూనే తన గాయానికి చికిత్స పొందుతున్నాడు. అయితే పూర్తిగా రికవరీ కాకపోవడం వల్ల తొలి టెస్టులో భాగం కాలేకపోయాడు. ఇప్పుడీ రెండో టెస్టుకు కూడా కేన్ దూరమయ్యాడు. తాజాగా ఈ విషయాన్ని క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇది చూసి క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందినప్పటికీ, కేన్ త్వరగా కోలుకోవాంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
"కేన్ విలియమ్సన్ పరిస్థితిని మేము దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. అతడు వేగంగానే కోలుకుంటున్నాడు. అయితే ఇంకా వంద శాతం ఫిట్‌గా మాత్రం లేడు. అందుకే అతడ్ని ఇంకాస్త రెస్ట్ తీసుకోమని సూచిస్తున్నాం. మరికొన్ని రోజుల్లో జరగనున్న మూడో టెస్టుకైనా అతడు అందుబాటులోకి రావచ్చని మేము ఆశిస్తున్నాం" అంటూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.