Sam Konstas Boxing Day Test : ఆస్ట్రేలియా అరంగేట్ర ప్లేయర్ సామ్ కాన్‌స్టాస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ యంగ్ ప్లేయర్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఏమాత్రం బెరుకు లేకుండా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
బుమ్రా ఓవర్లో సిక్సర్
ముఖ్యంగా వరల్డ్‌క్లాస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై విరుచుకుపడ్డాడు. 2021 నుంచి టెస్టుల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బుమ్రా, సామ్ కాన్‌స్టాస్ ధాటికి ఈ మ్యాచ్‌లో సమర్పించుకున్నాడు. దాదాపు 4,483 బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో ఈ సిక్స్ నమోదైంది. అటాకింగ్ గేమ్‌తో బుమ్రాను బ్యాక్ ఫుట్‌లో పెట్టిన సామ్, మిగతా బౌలర్లపై కూడా అదే రీతిలో విరుచుకుపడ్డాడు.
వన్డే తరహాలో బ్యాటింగ్
కాన్‌స్టాస్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అరంగేట్ర టెస్టులోనే 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా అద్భుతమైన బంతికి కాన్‌స్టాస్ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు.