Rohit Sharma Last Match For MI:స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ జెర్సీలో ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడా? అంటే సోషల్ మీడియాలో నెటిజన్లు ఔననే అంటున్నారు. ఇటీవల కోల్‌కతాతో మ్యాచ్ సందర్భంగా రోహిత్ మాటలే ఈ వార్తలకు బలం చేకుర్చుతున్నాయి. దీంతో ముంబయి తరఫున రోహిత్‌కు లఖ్‌నవూ మ్యాచ్ ఆఖరిది అని, వచ్చే సీజన్లో ఆ జట్టులో ఉండడన్న ప్రచారం సాగుతోంది.
'నాదేముంది భాయ్ ఇదే చివరిది. ఒక్కొక్కటిగా అన్నీ మారిపోతున్నాయి. అదంతా వాళ్ల మీద ఆధారపడి ఉంది. నేను వాటన్నింటినీ పట్టించుకోను. ఏదేమైనప్పటికీ అది నా ఇల్లు భాయ్. ఆ దేవాలయాన్ని నేను నిర్మించాను' అని రోహిత్ కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్‌తో అన్న మాటలు ఇటీవల వైరలయ్యాయి. కేకేఆర్ తమ అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేసి ఈ వీడియో నిమిషాల్లోనే వైరలైంది. దీంతో వెంటనే కేకేఆర్ అదే రోజు ఈ పోస్ట్‌ను డిలీట్ చేసింది.
ఇదే విషయంపై ముంబయి కోచ్ మార్క్ బ్రోచర్ కూడా లఖ్‌నవూ మ్యాచ్ తర్వాత స్పందించాడు. 'నేను లాస్ట్నైట్ రోహిత్‌తో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య అతడి కెరీర్ గురించి డీప్ డిస్కషన్స్ ఎమీ జరగలేదు. ఈ సీజన్లో మా పెర్ఫార్మెన్స్ గురించి రివ్యూ చేసుకున్నాం. తర్వాత 'నెక్ట్స్ ఏంటి?' అని రోహిత్‌ను అడిగా. వెంటనే 'తర్వాత ఏముంది ప్రపంచకప్పే' అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుత సీజన్లో మా జట్టు తరఫున అద్భుతంగా ఆడాడు. టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక వచ్చే సీజన్ వేలం నాటికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?' అని బ్రోచర్ అన్నాడు.