Irfan Pathan Wife Photo:టీమ్ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి తన భార్య సఫా బేగ్ (Safa Baig)ను ప్రపంచానికి పరిచయం చేశాడు. పెళ్లైన ఎనిమిదేళ్లకు ఆమె ఫేస్ రివీల్ చేశాడు. వారి వివాహ వార్షికోత్సవం (Wedding Anniversary) సందర్భంగా, ఆమెతో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'నువ్వు చాలా బాధ్యతలు తీసుకున్నావు. నాకు ఓ మిత్రుడిలా, కమెడియన్‌గా, నా పిల్లలకు తల్లిగా కీలకంగా వ్యవహరిస్తున్నావు. నువ్వు భార్యగా నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తా. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మై లవ్' అని పోస్ట్‌కు రాసుకొచ్చాడు.
Irfan Pathan Marriage:ఇర్ఫాన్ పఠాన్ సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె సనా బేగ్‌ను 2016లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇమ్రాన్, సులేమాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గతంలో ఇర్ఫాన్ ఎప్పుడు ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినా తన భార్య ఫేస్ మాత్రం కవర్ చేసి ఉండేది. ఫిబ్రవరి 03న వారి వెడ్డింగ్ డే కావడం వల్ల ఆమె ఫొటోను షేర్ చేశాడు. ఇక ఈ క్యూట్ కపుల్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు.