IPL Viewership Records:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. టీవీ, మొబైల్‌లో మ్యాచ్‌లు వీక్షించే వారి సంఖ్య కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 51 మ్యాచ్‌ల జరగ్గా, వీటిని 51 కోట్ల మంది వీక్షించినట్లు ఐపీఎల్ 2024 టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ డిస్నీ+ హాట్స్టార్ గురువారం పేర్కొంది. బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) విడుదల చేసిన గణాంకాలను పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే, ఈ సీజన్‌లో 18% వ్యూవర్‌షిప్ పెరిగినట్లు తెలిపింది.
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇంకా 17 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. మొదటి 51 మ్యాచ్‌లకు టెలివిజన్ వ్యూవర్ రేటింగ్స్ (TVR) పరంగా 2019లో క్రియేటైన రికార్డు కంటే ఇప్పుడు 5% ఎక్కువ సాధించినట్లు పేర్కొంది. TVR అనేది టెలివిజన్ ప్రోగ్రామ్ లేదా బ్రాడ్‌కాస్ట్ పాపులారిటీని కొలవడానికి ఉపయోగించే మెట్రిక్.
ప్లేఆఫ్స్ రేసుతో మరింత మజా:ఐపీఎల్ 2024 ప్లేఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. లీగ్ స్టేజ్‌లో ఇంకా 13 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వీక్షకుల సంఖ్య పెరగడానికి జట్ల మధ్య ప్లేఆఫ్ స్పాట్‌ల కోసం జరుగుతున్న పోరు ప్రధాన కారణం. ఇప్పటికే ముంబయి ఇండియన్స్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్‌లలో 8 విజయాలతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో 3వ ప్లేస్లో కొనసాగుతోంది. ఇక వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి.