తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ, అనుష్క షాకింగ్ నిర్ణయం - ఇది నిజమైతే ఫ్యాన్స్​కు హార్ట్ బ్రేకే! - IPL 2024 Kohli Anushka Sharma UK

IPL 2024 Kohli Anushka Sharma : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు లండన్​లో రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన భారత్ -ఇంగ్లాండ్​ టెస్ట్ సిరీస్​కు దూరంగా ఉన్న కోహ్లీ ఈమధ్యే ఐపీఎల్ మ్యాచ్ కోసం ఇండియాకు తిరిగి వచ్చాడు. అనుష్క తన పిల్లలతో లండన్​లోనే ఉంది. ఈ నేపథ్యంలో విరాట్-అనుష్క దంపతులు లండన్​లో స్థిరపడాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు.

కోహ్లీ, అనుష్క షాకింగ్ నిర్ణయం - ఇది నిజమైతే ఫ్యాన్స్​కు హార్ట్ బ్రేకే!
కోహ్లీ, అనుష్క షాకింగ్ నిర్ణయం - ఇది నిజమైతే ఫ్యాన్స్​కు హార్ట్ బ్రేకే!

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 1:08 PM IST

IPL 2024 Kohli Anushka Sharma : స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ - హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్​లో రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ తమ పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. తన రెండో బిడ్డ ఆకాయ్ పుట్టడం కారణంగానే భారత్-ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​కు కోహ్లీ దూరమయ్యాడు. అవసరమైన సమయంలో అతని కుటుంబానికి కోహ్లీ ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసించారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ ఐపీఎల్​లో మ్యాచుల్లో ఆడేందుకు తాజాగా భారత్​కు తిరిగి వచ్చాడు. కానీ అనుష్క మాత్రం తన ఇద్దరు పిల్లలతో లండన్​లోనే ఉండిపోయారు.

ఈ నేపథ్యంలో అనుష్క-విరాట్ తమ పిల్లలతో కలిసి లండన్​లోనే స్థిరపడేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అనుష్క శర్మ గతేడాది డిసెంబర్​లో లండన్ వెళ్లింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబంతో కొంతకాలంగా లండన్​లోనే ఉంటోంది ఈ జంట. అయితే అనుష్క, విరాట్ తమ పిల్లలతో కలిసి యూకేలోనే స్థిరపడాలని ప్లాన్ చేస్తున్నారంటూ ఓ నెటిజన్ పోస్టును షేర్ చేశాడు. ఈ పోస్టుపై నెటిజన్ల రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

విరాట్ ఐపీఎల్ కోసం ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ అనుష్క రాలేదు. ఐపీఎల్ పూర్తయిన తర్వాత విరాట్ తిరిగి లండన్ వెళ్లిపోవచ్చు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. డబ్బు ఉంటే యూకేలో జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు చేస్తే పౌరసత్వం సులభంగా లభిస్తుంది. వామికా, అకాయ్​ల గోప్యత ముఖ్యం. అనుష్క తన పిల్లలకు అండగా గృహిణిగా ఉండాలనుకుంటున్నాని గత ఇంటర్వ్యూలలో ఎప్పుడో చెప్పిందంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. మరికొంతమంది ఇదంతా ఫేక్ న్యూస్ అని అంటున్నారు. ఇలా నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే విరుష్క జోడీ అధికారికంగా స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.

WPL 2024 శెభాష్ స్మృతి - వీడియో కాల్​లో కోహ్లీ అభినందనలు

IPL 2024 టాప్‌ -10 బ్యాటర్స్ హై స్కోర్స్​ - ఈ విధ్వంసాలను మర్చిపోగలమా!

ABOUT THE AUTHOR

...view details