IPL 2024 RCB VS KKR Venkatesh Iyer : ఐపీఎల్ 2024ను వెంకటేశ్ అయ్యర్ పేలవంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడాడు. తాను ఎదుర్కొన్న 30 బంతుల్లోనే 50 పరుగులు హాఫ్ సెంచరీతో అభిమానుల్ని అలరించాడు. ఇక మ్యాచ్ అయిపోయాక అతడు వెన్నునొప్పితోనూ బాధపడ్డాడు. దీని గురించి వెంకటేశ్ మ్యాచ్ తర్వాత స్పందించాడు. కీలకమైన మ్యాచ్‌లో ఫామ్ అందుకోవడం మంచి విషయం. అయితే వెన్ను నొప్పి కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ స్కాన్ చేసిన తర్వాతే పరిస్థితిపై ఓ అంచనాకు వస్తుంది. అని వెంకటేశ్ అన్నాడు.
Venkatesh Iyer Fiancee :అర్ధ శతకం బాదిన నేపథ్యంలో తన కిస్ సెలబ్రేషన్ గురించి కూడా మాట్లాడాడు వెంకటేశ్ అయ్యర్. నాకు కాబోయే భార్య కూడా ఈ రోజు ఇక్కడికి మ్యాచ్ చూసేందుకు వచ్చింది. నా ఇన్నింగ్స్‌లో ఆమెకు క్రెడిట్ ఇవ్వాలని అనుకున్నాను. ఆమెకు దీన్ని డిడేకేట్ చేస్తున్నాను’అని వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు.
కాగా, గత ఏడాది నవంబరులో వెంకటేశ్ అయ్యర్‌కు నిశ్చితార్థం జరిగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న శృతి రఘునాథన్‌తో అతడి ఎంగేజ్మెంట్ అయింది. త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. కానీ సరిగ్గా పెళ్లి తేదీ గురించి సమాచారం ఇంకా బయటకు రాలేదు.