IPL 2024 PunJab Kings VS Sunrisers Hyderabad :ప్రస్తుతం సోషల్ మీడియా అంతా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ పేరే చక్కర్లు కొడుతోంది. చాలా మంది ఇతడి గురించే మాట్లాడుకుంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు చెలరేగి ఆడటమే ఇందుకు కారణం దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Nitish Kumar Pawan Kalyan : అయితే తాను ఇలా చెలరేగి ఆడటానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అంటున్నాడు నితీశ్ రెడ్డి! మ్యాచ్‌కు ముందు జానీ సినిమాలోని నారాజుగాకురా మా అన్నయ్యా నజీరు అన్నయా ముద్దుల కన్నయ్య అరె మనరోజు మనకుంది మన్నయ్యా అనే సాంగ్‌ను ఎక్కువగా వింటానని అన్నాడు నితీశ్. ఈ సాంగ్ బీట్, ఎనర్జీ తనకు బూస్ట్ ఇస్తుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ పాట కూడా పాడి వినిపించాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం విపరీతంగా కురుస్తోంది.