IPL 2024 PBKS VS CSK Records :పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డ్‌తో పాటు మరిన్ని రికార్డులు నమోదయ్యాయి.
పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు మూడేళ్ల తర్వాత విజయం సాధించింది. 2021 సీజన్‌లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పుడు 28 పరుగులు తేడాతో గెలిచింది.
ఒక ఐపీఎల్ మ్యాచులో అత్యధిక సార్లు 40+ స్కోరు, మూడు వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా నిలిచాడు రవీంద్ర జడేజా. దీంతో షేన్ వాట్సన్ (3), యువరాజ్ సింగ్ (3) సరసన నిలిచాడు. వీరి తర్వాత ఆండ్రి రస్సెల్ (2) కొనసాగుతున్నాడు.
పంజాబ్ కింగ్స్ హోంగ్రౌండ్స్లో ఘోరంగా ఫెయిల్ అయింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచుల్లోనూ ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. గతేడాది కూడా ఏడు మ్యాచుల్లోనూ ఒక్కటి మాత్రమే గెలిచి ఆరు ఓటములను మూటగట్టుకుంది.