IPL 2024 Play offs Race :ఐపీఎల్ 2024 లీగ్ దశ ధనాధన్ సాగుతూ ముందుకుపోతోంది. బౌలర్ల సంగతి పక్కనపెడితే బ్యాటర్లు మాత్రం వీరవిహారం చేస్తున్నారు. దీంతో మ్యాచులన్నీ దాదాపుగా ఏకపక్షంగా సాగుతూ పోతున్నాయి. అయితే ఈ సీజన్ లీగ్ దశలో ఇంకా 13 మ్యాచులే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏ టీమ్ కూడా అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు.
అయితే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడం వల్ల ముంబయి ఇండియన్స్ అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగినట్టైంది. 12 మ్యాచుల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది ముంబయి. దీంతో ఆ జట్టుకు ముందంజ వేసే ఛాన్స్‌లు ఇక లేవు.
ప్రస్తుతం చెరో 12 పాయింట్లతో కొనసాగతున్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఓ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా కూడా ఆ పాయింట్లు 14 అవుతాయి. ఒకవేళ అది రద్దైనా కూడా 13 పాయింట్లతో ముంబయి ఇండియన్స్ కన్నా మెరుగైన స్థితిలో ఆ జట్లు ఉంటాయి. ఇక మిగిలిన 9 జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసులోనే ఉన్నాయని చెప్పాలి.
అయితే 11 మ్యాచుల్లో ఎనిమిదేసి విజయాలు, 16 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న కేకేఆర్, ఆర్ఆర్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపుగా ఖాయమే. ఇంకొక్క విజయం సాధిస్తే ఈ రెండు టీమ్లకు తిరుగుండదనే చెప్పాలి.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై భారీ విజయంతో నెట్ రన్‌రేట్‌ను పెంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లేఆఫ్స్ రేసుకు మరింత చేరువైంది.12 మ్యాచులు ఆడి ఏడు విజయాలతో మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ మరో మ్యాచులో గెలిస్తే మరింత ముందుకు వెళ్తుంది. పైగా తన చివరి రెండు మ్యాచులను (గుజరాత్, పంజాబ్‌తో) సొంతగడ్డపైనే ఆడనుంది. ఇది ఆ జట్టుకు బాగా కలిసొచ్చే విషయం.
ఇక చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలో 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కానీ దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(12 మ్యాచ్‌లు) కన్నా ఓ మ్యాచ్ తక్కువే ఆడినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ మరో అడుగు ముందుకేసేందుకు మెరుగైన అవకాశాలున్నాయి.
11 మ్యాచుల్లో 8 పాయింట్లతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యమే. టెక్నికల్‌గా కాస్త అవకాశాలు ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్, ఇతర జట్ల రిజల్ట్స్‌పై ఈ మూడు టీమ్‌లు ఆధారపడాలి. కాగా, లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు చొప్పున ఆడతాయి అన్న సంగతి తెలిసిందే. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్‌గా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
58 బంతుల్లోనే 166 ఉఫ్ - సన్‌రైజర్స్ ఖాతాలో రికార్డులే రికార్డులు - IPL 2024 LSG VS SRH
కేఎల్ రాహుల్‌పై విరుచుకుపడ్డ లఖ్‌నవూ యజమాని! - వైరల్ వీడియో చూశారా? - IPL 2024 LSG